IPL 2026: సంజూ సూపర్ బ్యాటింగ్.. ఢిల్లీపై చెన్నై విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
- Naveen
- Updated on- May 5, 2026 / 11:04 PM IST
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 రన్స్ టార్గెట్ ను సీఎస్ కే మరో 15 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి మెరిశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు బాదాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టుని గెలిపించాడు. మరో ఎండ్ లో కార్తిక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 31 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు.
