Chennai Super Kings : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఉప్పల్‌లో ధోనిని ఎప్పుడు చూడొచ్చంటే?
ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు ఆరోసారి కప్పును ముద్దాడాలని భావిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : March 27, 2026 / 01:00 PM IST
IPL 2026 Chennai Super Kings Full Schedule here
Chennai Super Kings : ఐపీఎల్ 2026 సీజన్ శనివారం (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించి తొలుత 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ గురువారం మిగిలిన 50 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆరోసారి కప్పును ముద్దాడాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.
ఆర్ఆర్ నుంచి ట్రేడింగ్‌లో సీఎస్‌కేకు వచ్చిన సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు.
RCB : ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో ఎప్పుడు ఆడనుందంటే?
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే..
* మార్చి 30న – రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (గుహవాటి)
* ఏప్రిల్ 3న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( చెన్నై)
* ఏప్రిల్ 5న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
* ఏప్రిల్ 11న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై)
* ఏప్రిల్ 14న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (చెన్నై)
* ఏప్రిల్ 18న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( హైదరాబాద్ )
* ఏప్రిల్ 23న – ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ముంబై)
RCB vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భువనేశ్వర్ కుమార్
Superfans, are you ready? 🤩
This summer, all you need is Yellove and #WhistlePodu for the Super Kings! 💛🥳#IPL2026 pic.twitter.com/FpUKEAu31X
— Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2026
* ఏప్రిల్ 26న – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3.30 గంటలకు)
* మే 2న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (చెన్నై)
* మే 5న – ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ఢిల్లీ)
* మే 10న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (చెన్నై, మధ్యాహ్నం 3.30 గంటలకు)
* మే 15న – లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (లక్నో)
* మే 18న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
* మే 21న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( చెన్నై)
