RCB : ఐపీఎల్ 2026లో ఆర్సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌తో ఎప్పుడు ఆడనుందంటే?
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB ) బరిలోకి దిగనుంది.
IPL 2026 Royal Challengers Bengaluru Full Schedule here
RCB : శనివారం (మార్చి 28) నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా.. ఈ సీజన్లో ఆర్సీబీ ఐదు హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులో మరో రెండు హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది. మొత్తంగా లీగ్ దశలో ఆర్సీబీ 14 మ్యాచ్‌లు ఆడనుంది. స్టార్ విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.
RCB vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భువనేశ్వర్ కుమార్
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే..
* మార్చి 28న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
* ఏప్రిల్ 5న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (బెంగళూరు)
* ఏప్రిల్ 10న – రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (గుహవాటి)
* ఏప్రిల్ 12న – ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ముంబై)
* ఏప్రిల్ 15న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (బెంగళూరు)
* ఏప్రిల్ 18న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
* ఏప్రిల్ 24న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (బెంగళూరు)
* ఏప్రిల్ 27న – ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
* ఏప్రిల్ 30న – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అహ్మదాబాద్)
* మే 7న – లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (లక్నో)
* మే10న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (రాయ్‌పుర్)
* మే 13న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (రాయ్‌పూర్)
* మే17న – పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ధర్మశాల, మధ్యాహ్నం 3.30 గంటలకు)
* మే 22న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఉప్పల్)
