IPL 2026 CSK vs MI : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో CSK సూపర్ విక్టరీ.. ముంబైకి తప్పని ఓటమి
IPL 2026 CSK vs MI : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Harish Thanniru
- Updated on- May 2, 2026 / 11:44 PM IST
IPL 2026 CSK vs MI
IPL 2026 CSK vs MI : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. శనివారం రాత్రి ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సీఎస్‌కే ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 18.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
Also Read : CSK vs MI : నేడు చెన్నై వర్సెస్ ముంబై.. ధోని, రోహిత్‌లు ఆడేనా? ఒకరినొకరు కలుసుకుని..
ఈ మ్యాచ్ లో తొలుత ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (37), నమన్ ధీర్ (57), సూర్యకుమార్ యాదవ్ (21) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. తిలక్ వర్మ (5), విల్ జాక్స్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ 159 పరుగులకు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) రాణించడంతో 18.1 ఓవర్లలోనే 160తో సీఎస్‌కే విజయం సాధించింది.
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ అర్ధసెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ తో విజయంలో కీలక భూమిక పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, ఈ సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో చెన్నై ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలోకి దూసుకెళ్లింది. ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ముంబై మరో మ్యాచ్ ఓడిపోతే ప్లేఆఫ్ అవకాశాలు పూర్తిగా గల్లంతైనట్లేనని చెప్పొచ్చు.
8 POINTS FOR CHENNAI SUPER KINGS IN IPL 2026 🔥🫡 pic.twitter.com/uqODXmfetm
— Johns. (@CricCrazyJohns) May 2, 2026
