IPL 2026 CSK vs MI : ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్.. CSKపై ఓటమి తరువాత హార్థిక్ పాండ్యా సంచలన కామెంట్స్.. వారివల్లే ఈ పరిస్థితి..
IPL 2026 CSK vs MI : ఇక్కడ లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం, చేతిలో వికెట్లు ఉంచుకోవడం కీలకం. ఆ ప్రణాళికలను మేము అమలు చేయలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
- Harish Thanniru
- Published on- May 3, 2026 / 07:00 AM IST
Hardik Pandya
- ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి
- ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
- ఓటమిపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కీలక కామెంట్స్
IPL 2026 CSK vs MI : ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ తప్పుకుంది. టోర్నీలో మిగిలిన ఐదు మ్యాచ్‌లకు ఐదు గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే, సీఎస్కే జట్టుపై ఓటమి తరువాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ జట్టు ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు.
Also Read : IPL 2026 CSK vs MI : తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో CSK సూపర్ విక్టరీ.. ముంబైకి తప్పని ఓటమి
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. మూడు విభాగాల్లో చెన్నై సూపర్ కింగ్స్ తమకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్ తో పాటు ఈ సీజన్ మొత్తం తమకు కలిసి రాలేదు. ఈ పిచ్ పై 180 నుంచి 190 పరుగులు మంచి స్కోర్. ఓ దశలో మేము ఆ స్కోర్ చేయగలమని భావించాం. అది మంచి స్కోర్ అయ్యేది. కానీ, 10 ఓవర్ల తరువాత మా బ్యాటింగ్ దూకుడుగా ముందుకు సాగలేదని, మా బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమయ్యాం అని హార్దిక్ పేర్కొన్నాడు.
బౌలింగ్ విభాగంలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. సీఎస్కే బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేయడానికి మాకున్న బౌలింగ్ వనరులతో మేము ప్రయత్నించాం. కానీ, వారు తెలివిగా బ్యాటింగ్ చేశారు. వాస్తవానికి ఈ పిచ్‌పై క్రీజులోకి రాగానే భారీ షాట్స్ ఆడటం అంత సులువు కాదు. చెన్నై బ్యాటర్లు కూడా సెట్ అయిన తరువాత కూడా భారీ షాట్స్ ఆడలేకపోయారు.
ఇక్కడ లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం, చేతిలో వికెట్లు ఉంచుకోవడం కీలకం. ఆ ప్రణాళికలను మేము అమలు చేయలేకపోయామని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు విభాగాల్లో చెన్నై తమకంటే మెరుగైన ప్రదర్శన చేసిందని, ఆ స్థాయింలో మేము రాణించలేకపోయామని హార్దిక్ పేర్కొన్నారు.
