Shreyas Iyer : అందుక‌నే చాహ‌ల్‌కు పూర్తి ఓవ‌ర్ల కోటా ఇవ్వ‌లేదు.. నాకు మైదానంలో డౌట్ వ‌స్తే.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్ వైర‌ల్

చెన్నై సూప‌ర్ కింగ్స్ పై విజ‌యం సాధించ‌డం ప‌ట్ల పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer )ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

IPL 2026 CSK vs PBKS Shreyas Iyer comments comments after Punjab Kings win the match against Chennai Super Kings

  • వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో విజ‌యం
  • ఆనందాన్ని వ్య‌క్తం చేసిన పంజాబ్ కెప్టెన్
  • గెలిచినా స‌రే ఓ విష‌యంలో ఇంకా మెరుగు అవ్వాల్సి ఉంద‌న్న అయ్య‌ర్‌

Shreyas Iyer : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. శుక్ర‌వారం చెన్నైలోని చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ జ‌ట్టు 5 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ విజ‌యం ప‌ట్ల పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఓపెన‌ర్లు అందించిన శుభారంభం కార‌ణంగానే విజ‌యం సాధించామ‌ని చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో ఆయుష్ మాత్రే (73) అర్థ‌శతకం చేశాడు. శివ‌మ్ దూబె (45 నాటౌట్), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (32) రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో విజయకుమార్ వైశాఖ్ రెండు వికెట్లు తీయ‌గా.. జేవియర్ బార్ట్‌లెట్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం 210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో శ్రేయాస్ అయ్య‌ర్ (50) అర్ధ‌శ‌త‌కం బాద‌గా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (43), ప్రియాన్ష్ ఆర్య (39)లు వేగంగా ఆడారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ లు చెరో రెండు వికెట్లు సాధించారు.

Shreyas Iyer fined : చెన్నైపై విజ‌యం.. పంజాబ్ కెప్టెన్‌ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు భారీ జ‌రిమానా.. ఇంకోసారి ఇలాగే జ‌రిగితే..

ఇక ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. ఓపెన‌ర్లు ప్రియాన్ష్, ప్రభ్‌ చాలా బాగా ఆడార‌ని మెచ్చుకున్నాడు. ఓపెన‌ర్లు ఇచ్చిన అద్భుత ఆరంభ‌మే గెలుపులో కీల‌క పాత్ర పోషించింద‌న్నాడు. ఇక జ‌ట్టులో ఉన్న అంద‌రికి బ్యాటింగ్ చేసే అవ‌కాశం రావ‌డం శుభ‌ప‌రిణామం అని చెప్పుకొచ్చాడు. దీని వ‌ల్ల ఒత్తిడి స‌మ‌యాల్లో ప్లేయ‌ర్లు ఎలా స్పందించాలో నేర్చుకుంటార‌న్నాడు.

ఇక ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంద‌న్నాడు. ఇలాంటి పిచ్ పై త‌మ బౌల‌ర్లు తొలి మూడు ఓవ‌ర్ల‌లో 25 ప‌రుగులు మాత్ర‌మే ఇవ్వ‌డం చాలా బాగుంద‌న్నాడు. అయితే.. ఆ త‌రువాత సీఎస్‌కే బ్యాట‌ర్లు పుంజుకున్నార‌ని చెప్పుకొచ్చాడు. అలాంటి స‌మ‌యంలో బౌల‌ర్లు ప్ర‌శాంతంగా ఉండ‌డం ముఖ్యం అని అన్నాడు.

ఆ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి

స్లో ఓవ‌ర్ రేటు (నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్లను పూర్తి చేయ‌క‌పోవ‌డం) విష‌యంలో తాము చాలా మెరుగుప‌డాల్సి ఉంద‌న్నాడు. ఇలాగే కొన‌సాగితే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్నాడు. ఇక చాహ‌ల్‌తో పూర్తి ఓవ‌ర్ల కోటా వేయించ‌క‌పోవ‌డంపై స్పందించాడు. ఆ స‌మ‌యంలో క్రీజులో శివ‌మ్ దూబె ఉన్నాడు. అత‌డు స్పిన్న‌ర్ల బౌలింగ్‌లో ఎలా ఆడ‌తాడో అంద‌రికి తెలుసు. అత‌డే కాక దేశీయ ఆట‌గాళ్లు కూడా స్పిన్‌ను చాలా బాగా ఆడ‌తారు. అందుక‌నే ఆ స‌మ‌యంలో సీమ‌ర్ల‌తో బౌలింగ్ చేయించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

Ruturaj Gaikwad : మేం ఓడిపోయింది అందుకే.. మా బౌల‌ర్లు ఉన్నారే.. రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్‌..

చాహ‌ల్ అద్భుత‌మైన బౌల‌ర్ అని కొనియాడాడు. ఐపీఎల్‌లో అత్యుత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌డని అన్నాడు. అందుక‌నే మైదానంలో త‌న‌కు ఏదైన సందేహం వ‌చ్చినా కూడా అత‌డి వ‌ద్ద‌కే తాను వెళ‌తాన‌ని శ్రేయ‌స్ అయ్య‌ర్ తెలిపాడు.