IPL 2026 DC vs CSK : అదే మా కొంపముంచింది.. ఓట‌మిపై ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ హాట్ కామెంట్స్‌..

సీఎస్‌కేతో మ్యాచ్‌లో (IPL 2026 DC vs CSK) త‌మ జ‌ట్టు ఓట‌మిపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ స్పందించాడు.

IPL 2026 DC vs CSK Axar Patel comments after Delhi Capitals lost match to Chennai Super Kings (pic credit@ipl)

  • సీఎస్‌కే పై ఓట‌మి
  • ఢిల్లీ ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం
  • స్పందించిన కెప్టెన్ అక్ష‌ర్‌ ప‌టేల్

IPL 2026 DC vs CSK : ఐపీఎల్ 2026లో భాగంగా మంగ‌ళ‌వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 8 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. త‌ద్వారా ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ఇక పై మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధిస్తేనే ప్లేఆఫ్‌లో ఢిల్లీ అడుగుపెట్టే ప‌రిస్థితి నెల‌కొంది. సీఎస్‌కే పై ఓట‌మి బాధించింద‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ తెలిపాడు.

స‌మీర్ రిజ్వీ (40 నాటౌట్; 24 బంతుల్లో 4 సిక్స‌ర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (38; 31 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీశాడు. అకేల్ హోసేన్, ముఖేష్ చౌదరి, గుర్జప్రీత్ సింగ్, జామీ ఓవర్టన్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

అనంత‌రం సంజూ శాంస‌న్ (87 నాటౌట్; 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ బాద‌గా కార్తీక్ శ‌ర్మ (41 నాటౌట్ ; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించ‌డంతో 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు 17.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్‌, లుంగి ఎంగిడి చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

10 నుంచి 15 ప‌రుగులు త‌క్కువ‌గా చేశాం..

ఇక మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ స్పందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పిచ్ ప్ర‌వ‌ర్తించిన తీరును బ‌ట్టి 155 ప‌రుగులు మంచి స్కోరు అని తాను భావించాన‌ని అన్నాడు. అయితే.. త‌మ జ‌ట్టులో 8 మంది బ్యాట‌ర్లు ఉండ‌డంతో తాము 10 నుంచి 15 ప‌రుగులు త‌క్కువ చేసిన‌ట్లుగా అనిపించింద‌న్నాడు. ఒక‌వేళ తాము 170 ప‌రుగులు చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉండేద‌న్నాడు. బంతి అప్పుడ‌ప్పుడు ఆగుతూ వ‌స్తోంది. దీంతో కొత్త బ్యాట‌ర్ల‌కు బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాదు.. కానీ క్రీజులో నిల‌దొక్కుకున్న బ్యాట‌ర్ మాత్రం ఈజీగా ప‌రుగులు చేయొచ్చున‌ని చెప్పాడు..

Ashok Dinda : ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌

చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన సంజూ శాంస‌న్ పై అక్ష‌ర్ ప‌టేల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. సంజూ చాలా బాగా ఆడాన‌ని అన్నాడు. పిచ్‌ను చాలా బాగా అర్థం చేసుకున్నాడ‌ని, తొలుత సెట్ అయి ఆపై ప‌రుగులు రాబ‌ట్టాడ‌ని చెప్పుకొచ్చాడు. త‌మ బౌల‌ర్లు ఇబ్బంది పెట్టే బంతులు వేసిన‌ప్ప‌టికి కూడా చాలా చ‌క్క‌గా ఆడాన‌ని అన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తాము ఓడిపోయిన‌ప్ప‌టికి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయ‌న్నాడు. తాము 69 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికి కూడా 155 ప‌రుగుల‌కు చేరుకోవ‌డం బాగుంద‌న్నాడు. ఇక త‌దుప‌రి మ్యాచ్‌ల‌పై స్పందిస్తూ తాము ఇప్పుడు కిష్ట స్థితిలో ఉన్నామ‌ని, మిగిలిన మ్యాచ్‌ల్లో గెల‌వ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అన్నాడు. ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేద‌న్నాడు.