Ashok Dinda : ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీమ్ఇండియా క్రికెటర్
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా (Ashok Dinda) వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించాడు
Ex Team India player Ashok Dinda became mla for the second time
- వరుసగా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ దిండా
- మొయినా నియోజకవర్గం నుంచి
- బీజేపీ అభ్యర్థిగా
Ashok Dinda : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాదించాడు. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన 16 వేల 241 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అశోక్ దిండాకు 1,27,166 ఓట్లు రాగా ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి చందన్ మండల్‌కు 1,10, 925 ఓట్లు వచ్చాయి. దిండా గతంలో కూడా మొయినా నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
విజయం సాధించిన అనంతరం దిండా మాట్లాడుతూ.. ‘నేను కష్టపడి పనిచేశాను, నేను చేయాల్సిన పనిపై దృష్టి పెట్టాను. అవును..ఇప్పుడు నాపై మరింత పెద్ద బాధ్యత ఉంది, ఎందుకంటే నేను మొయినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. ఏదేమైనా ఇది వారి విజయమే కదా.’ అని అన్నాడు.
2009 నుంచి 2013 వరకు టీమ్ఇండియాకు అశోక్ దిండా ప్రాతినిధ్యం వహించాడు. 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. వన్డేల్లో 12 వికెట్లు టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 78 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు సాధించాడు.
2021లో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిండా బీజేపీలో చేశారు. 2021లోనే మొయినా నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశాడు. అప్పుడు టీఎంసీకి చెందిన సంగ్రామ్ డోలుయిని ఓడించారు.
