DC vs GT : అందుక‌నే మేం ఓడిపోవాల్సి వ‌చ్చింది.. లేదంటేనా.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌..

గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో (DC vs GT) ఢిల్లీ క్యాపిట‌ల్స్ తృటిలో విజ‌యాన్ని చేజార్చుకుంది.

IPL 2026 DC vs GT Axar Patel comments after Delhi Capitals lost match by 1 run against Gujarat Titans (pic credit@ipl)

  • ఉత్కంఠ మ్యాచ్‌లో ఓట‌మి
  • తీవ్ర నిరాశ క‌లిగించింద‌న్న అక్ష‌ర్ ప‌టేల్‌
  • వికెట్లు కోల్పోవ‌డం వ‌ల్లే ఇదంతా అని కామెంట్స్‌

DC vs GT : బుధ‌వారం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తృటిలో విజ‌యాన్ని చేజార్చుకుంది. ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోయింది. రెండు జ‌ట్లు అద్భుతంగా ఆడాయ‌ని, ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌ల్లో ఓట‌మికి ఎన్నో కార‌ణాల‌ను ఎత్తి చూప‌వ‌చ్చున‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ తెలిపాడు. ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోవ‌డం త‌న‌ను నిరాశ‌ప‌రిచింద‌న్నాడు.

ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (70; 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), జోస్ బ‌ట్ల‌ర్ (52; 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (55; 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. లుంగి ఎంగిడి, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా ఓ వికెట్ సాధించాడు.

MS Dhoni : చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు భారీ షాక్! మ‌రిన్ని మ్యాచ్‌ల‌కు ఎంఎస్ ధోని దూరం?

అనంత‌రం 211 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (92; 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా.. పాతుమ్ నిస్సాంక (41; 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స‌ర్), డేవిడ్ మిల్ల‌ర్ (41 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) వేగంగా ఆడాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. ప్ర‌సిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.

ఆఖ‌రిలో ఒత్తిడి పెరిగింది

ఇక మ్యాచ్ అనంత‌రం ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ మాట్లాడాడు. త‌మ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేశాడు. మ్యాచ్ జ‌రిగిన తీరును చూస్తే రెండు జ‌ట్లు చాలా మంచి క్రికెట్ ఆడాయ‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌ల్లో ఓట‌మికి ఎన్నో కార‌ణాల‌ను ఎత్తి చూప‌వ‌చ్చున‌ని అన్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి తాము మంచి క్రికెట్ ఆడామ‌ని అన్నాడు.

అదే స‌మ‌యంలో ల‌క్ష్య ఛేద‌న‌లో తాము మ‌రింత తెవిలిగా వ్య‌వ‌హ‌రించి ఉండాల్సిందన్నాడు. కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు కోల్పోవ‌డం దెబ్బ‌తీసింద‌న్నాడు. వికెట్లు కోల్పోకుండా ఉండి ఉండే చాలా ముందుగానే ల‌క్ష్యాన్ని ఛేదించేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. వికెట్లు కోల్పోవ‌డంతో ఆఖ‌రిలో ఒత్తిడి పెరిగింద‌న్నాడు.

Mahela Jayawardene : స్టార్ ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్‌ను ఎందుకు ఆడించ‌డం లేదు? ముంబై హెడ్ కోచ్ జ‌య‌వ‌ర్థ‌నే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అత‌డు ఇంకా..

కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడ‌ని కొనియాడాడు. ప‌వ‌ర్ ప్లేలో ల‌భించిన జోరును అత‌డు కొన‌సాగించాడ‌ని తెలిపాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి కూడా మ‌రో వైపు ర‌న్‌రేటును మ‌రింత‌గా ప‌డిపోకుండా చూశాడ‌ని అన్నాడు. ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోవ‌డం నిరాశ క‌లిగించింద‌న్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్ నుంచి త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని త‌దుప‌రి మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేశాడు.