MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్! మరిన్ని మ్యాచ్‌లకు ఎంఎస్ ధోని దూరం?
ఎంఎస్ ధోని (MS Dhoni) గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.
IPL 2026 Big shock to CSK MS Dhoni To Miss More Matches reports (pic credit@csk)
- ధోని గాయం పై స్పష్టత ఇచ్చిన సీఎస్కే సీఈఓ
- మహేంద్రుడు ఇంకా కోలుకోలేదు
- ఇంకొన్ని రోజులు పట్టొచ్చు
- ఏ రోజున బరిలోకి దిగుతాడు అనే విషయం ఇప్పుడే చెప్పలేం
MS Dhoni : రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2026 సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఐదు సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. తొలి విజయం కోసం వేచి చూస్తోంది. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వస్తే పరిస్థితి మారుతుందని చెన్నై ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సీజన్‌కు ముందు సీఎస్కే నిర్వహించిన క్యాంపులో ధోని మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు కూడా ధోని పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈ సీజన్లో అతడు మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడు అన్న దానిపై స్పష్టత లేదు. ఈ విషయాన్ని స్వయంగా సీఎస్ సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించడం గమనార్హం.
ప్రీ సీజన్ క్యాంప్‌లో ధోనికి గాయమైంది. ఇంకా అతడు కోలుకోలేదు. అతడు ఎప్పుడు బరిలోకి దిగుతాడు అన్న సంగతి ఇప్పుడే చెప్పలేం. మరి కొన్ని రోజులు పట్టవచ్చు. అని కాశీ విశ్వనాథ్ తెలిపారు. దీంతో ఏప్రిల్ 11న చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ధోని ఆడడం కష్టమేనని అర్థమవుతోంది.
బ్రెవిస్ సిద్ధం..
సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని కాశీ విశ్వనాథ్ తెలిపారు. తదుపరి మ్యాచ్‌లో అతడు ఆడే అవకాశం ఉందన్నాడు. గత సీజన్లో బ్రెవిస్ 180 స్ట్రైక్‌రేటుతో అద్భుమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు వస్తే.. సీఎస్కే మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుంది.
