MS Dhoni : CSK ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్.. ధోనీ ఎంట్రీపై కీలక ప్రకటన
MS Dhoni : ఉత్కంఠభరితమైన ముంబై వర్సెస్ సీఎస్కే మ్యాచ్ లో ధోనీ ఆడుతున్నాడా అనే దానిపై బిగ్ అప్డేట్ వచ్చింది.
- Dharani Pilli
- Updated on- April 23, 2026 / 07:17 PM IST
IPL 2026 Dhoni is unlikely to play CSK vs Mumbai Indians today
- ధోని రాకపై బిగ్ అప్డేట్
- ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ధోనీ దూరం
- ఏప్రిల్ 26న గుజరాత్ టైటాన్స్ పై బరిలోకి దిగనున్న ధోనీ
MS Dhoni : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం (ఏప్రిల్ 23) ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అయితే మ్యాచ్ లో ధోని బరిలోకి దిగుతారని ఆశించిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చివరి నిమిషంలో నిరాశే ఎదురయ్యింది. తలా ఈ మ్యాచ్ లో కూడా ఆడటం లేదు. దీనిపై ప్రకటన వచ్చేసింది. దీనిపై సీఎస్కే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని ప్లేయింగ్ 11లో ఉంటాడనే నమ్మకంతోనే టికెట్లు కొన్నామని.. చివరి నిమిషయంలో ఇలాంటి ప్రకటన చేయడం బాగా లేదని.. ఇక మ్యాచ్ చూడ్డానికి కూడా ఆసక్తి లేదంటూ నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కి ధోని సిద్ధంగా ఉన్నాడని.. మైదానంలోకి దిగడమే ఆలస్యం అంటూ అభిమానులను ఊరించి.. చివరికి మళ్లీ బ్యాడ్ న్యూసే చెప్పారు. ఇదిలా ఉంటే సీఎస్కే.. ఏప్రిల్ 26, ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లోనే ధోనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026 ప్రారంభమై సగం సీజన్ అయిపోవస్తున్నా.. ఇప్పటి వరకు ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో ధోనీ.. నేరుగా సీఎస్కే హోం గ్రౌండ్‌లోనే బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీజన్ ప్రారంభానికి ముందే కాఫ్ స్ట్రెయిన్ (పిక్క కండరాల గాయం) బారిన పడటంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తొలుత 3 వారాల పాటు రెస్ట్ ధోని తీసుకోనున్నట్లు సీఎస్కే మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడటానికి సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం ధోనీ జట్టుతో పాటు ప్రయాణిస్తున్నా.. గ్రౌండ్‌లోకి దిగడానికి ఇంకాస్త సమయం పడుతుందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. బుధవారం వాంఖడేలో జరిగిన నెట్స్ సెషన్‌లో ధోనీ బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. అయితే ధోనీ ఆడటం అనేది పూర్తిగా ఆయన ఇష్టం, వైద్య బృందం ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందని సిఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపారు. ఒకవేళ ఈ మ్యాచ్‌కు దూరమైతే, మే 21న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సమయంలో ధోనీ అక్కడున్న AI రోబోటిక్ డాగ్‌తో ఆడుకుంటూ కనిపించి అందరినీ అలరించారు.
ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హ్యామ్ స్ట్రింగ్ (కాలి కండరాల గాయం) కారణంగా ఆయన గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. బుధవారం రోహిత్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ చేశారు. ఆయన బ్యాటింగ్ చేసేటప్పుడు పెద్దగా అసౌకర్యం కనిపించలేదని సమాచారం. అయితే, రోహిత్ ఆడతారా లేదా అనేది టాస్ సమయంలోనే తేలనుంది.
