SRH captain : రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌.. ఇషాన్ కిష‌న్‌కు షాక్.. కెప్టెన్సీ నుంచి తొల‌గింపు.. ఎవ‌రి సారథ్యంలో స‌న్‌రైజ‌ర్స్ ఆడ‌నుందంటే?

స‌న్‌రైజర్స్ రెగ్యుల‌ర్ కెప్టెన్ (SRH captain ) పాట్ క‌మిన్స్ శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడు.

IPL 2026 Do you who is captin for shr today against RR (pic credit@ipl)

  • కోలుకున్న క‌మిన్స్‌
  • రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో ఆడ‌తాన‌ని వెల్ల‌డి
  • ఎస్ఆర్‌హెచ్‌కు తానే సార‌థ్యం వ‌హిస్తాన‌ని స్ప‌ష్ట‌త

SRH captain : ఐపీఎల్ 2026 లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో నేడు (ఏప్రిల్ 25) రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు శుభ‌వార్త అందింది.

వెన్నుగాయంతో ఇన్నాళ్లు ఆట‌కు దూరంగా ఉన్న స‌న్‌రైజర్స్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో బ‌రిలోకి దిగ‌నున్నాడు. ఇప్ప‌టికే ఫిట్‌నెస్ ను నిరూపించుకున్న ఈ ఆల్‌రౌండ‌ర్ క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఆడేందుకు అనుమ‌తి సైతం పొందాడు.

Virat Kohli : బెథెల్‌కు నాకు మ‌ధ్య అదే చ‌ర్చ‌.. విరాట్ కోహ్లీ కీల‌క కామెంట్స్‌..

ఇక మ్యాచ్‌లో బ‌రిలోకి దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు పాట్ క‌మిన్స్ వెల్ల‌డించాడు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. మైదానంలోకి దిగేందుకు ఉత్సుక‌త‌తో ఉన్నా అని సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు. అంతేకాదండోయ్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని చెప్పుకొచ్చాడు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఏకైక ఆట‌గాడు.. ఒక‌టి కాదు రెండు..

ఇన్నాళ్లు క‌మిన్స్ గైర్హాజ‌రీలో ఇషాన్ కిష‌న్ సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు తాత్కాలిక సార‌థిగా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాడు. ఇషాన్ నాయ‌క‌త్వంలో స‌న్‌రైజ‌ర్స్ ఈ సీజ‌న్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా మ‌రో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేటు +0.820గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో 4వ స్థానంలో ఉంది.

రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రావ‌డంతో ఇషాన్ ఇక ప్లేయ‌ర్‌గానే బ‌రిలోకి దిగ‌నున్నాడు.