IPL 2026 : వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌కు గుడ్‌న్యూస్.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్ 2026లో (IPL 2026 )వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభవార్త అందింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 14, 2026 / 10:37 AM IST
IPL 2026 Good news kkr Pathirana granted NOC by Sri Lanka Cricket (pic credit@ipl)
- ఫిట్‌నెస్ టెస్టు పాసైన మతీషా పతిరానా
- ఎన్ఓసీ జారీ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు
- అతి త్వరలో కేకేఆర్ జట్టులో చేరనున్న పతిరానా
IPL 2026 : వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభవార్త అందింది. శ్రీలంక స్టార్ పేసర్ మతీషా పతిరానా శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో పాసైయ్యాడు. దీంతో అతడు ఐపీఎల్ 2026లో ఆడేందుకు లంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ( No Objection Certificate) ఇచ్చింది. దీంతో అతడు అతి త్వరలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో కలవనున్నాడు.
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు పతిరానా అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. అయితే.. కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఏప్రిల్ 17న ఆడనుంది. ఈ మ్యాచ్ నాటికి అతడు జట్టుతో కలిసే అవకాశం ఉంది.
అయితే.. కేకేఆర్ వైద్య బృందం కూడా అతడి ఫిట్‌ను పరీక్షించిన తరువాతనే ఆడేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 19న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు కేకేఆర్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉంది.
ఈసీజన్‌లో బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు సాధిస్తున్నప్పటికి కూడా కేకేఆర్ బౌలింగ్ విభాగం బలహీనంగా ఉంది. సీజన్ ఆరంభానికి ముందే హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్‌లు గాయాల కారణంగా తప్పుకున్నారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయడం ఇంకా స్పిన్ ప్రధాన ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఫామ్ కోల్పోవడం వంటి కారణాలతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 220 పరుగులను కాపాడుకోలేకపోవడం కేకేఆర్ బౌలింగ్ బలహీనతను తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో 18 కోట్లకు కొనుగోలు చేసిన డెత్ స్పెషలిస్టు, యార్కర్ల కింగ్ పతిరానా జట్టుతో చేరుతుండడం కేకేఆర్‌కు శుభవార్త ఇచ్చే అంశం.
