IPL 2026 : అయ్యో సిరాజ్.. ఎంతపని చేశావ్..! క్యాచ్ పట్టి బౌండరీలోకి విసిరేసిన సిరాజ్.. వీడియో వైరల్
IPL 2026 : కగిసో రబడా వేసిన 17వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద మహమ్మద్ సిరాజ్ క్యాచ్ మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
- Harishth Thanniru
- Published On : April 5, 2026 / 08:01 AM IST
Mohammed Siraj
IPL 2026 : ఐపీఎల్ -2026లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరికి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌండరీలైన్ వద్ద క్యాచ్ పట్టి బంతిని మళ్లీ బౌండరీలోకి విసిరేశాడు. కగిసో రబడా వేసిన 17వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో మూడో బంతిని రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ లో ఉన్న సిరాజ్.. బౌండరీ బయట పడుతున్న బంతిని పైకెగిరి అందుకున్నాడు. కానీ, ఈ క్రమంలో అతను పట్టు కోల్పోయాడు. బౌండరీ బయట అడుగు పడుతుందని భావించిన సిరాజ్.. బంతిని గ్రౌండ్‌లోకి విసిరేసే ప్రయత్నం చేశాడు. కానీ, పొరపాటున బంతిని గ్రౌండ్‌లోకి కాకుండా బౌండరీ బయటకు విసిరేశాడు. మళ్లీ దాన్ని పట్టుకునే క్రమంలో సిరాజ్ విఫలమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Good effort but not everyone is Glenn Phillips flying superman#GTvsRR pic.twitter.com/eqfaO4HaI8
— Cricket Shitpost (@CricketShix) April 4, 2026
సిరాజ్ అత్యుత్సాహంతో ఈజీ క్యాచ్ ను కాస్త సిక్సర్ గా మార్చాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే.. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
