IPL 2026 Gujarat Titans Appoint Matthew Hayden As Batting Coach
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ ను నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ నియామకం గురించి గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ.. మా ప్రయాణంలో మాథ్యూ హేడెన్ నియామకం ఓ కీలకమైన దశ. దీర్ఘకాలికి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అతడిని బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకున్నాము. అతడికి అపార అనుభవం ఉంది. యువ ఆటగాళ్లకు అతడు సరైన దిశలో మార్గనిర్దేశ్యం చేస్తాడు. మా బ్యాటింగ్ బలోపేతం చేయడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడు అని అన్నాడు.
Powerhouse. Legend. Now our Batting Coach 💪
Saying ‘𝗛𝗮𝘆-𝗗𝗼𝘀t’ to @HaydosTweets 👋 pic.twitter.com/J3eE59AzM1
— Gujarat Titans (@gujarat_titans) March 10, 2026
ఇక తన నియామకం గురించి హేడెన్ మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నాడు. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్‌తో కలిసి హేడెన్ పనిచేయనున్నాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి 273 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు మాథ్యూ హేడెన్ ప్రాతినిథ్యం వహించాడు. 15 వేలకు పైగా పరుగులు సాధించాడు. పలు ఐసీసీ టోర్నీ విజయాల్లో ఆసీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అతడు ఐపీఎల్‌లో 32 మ్యాచ్‌లు ఆడాడు. సీఎస్‌కే కు ప్రాతినిథ్యం వహించిన హేడెన్ 36.9 సగటుతో 1107 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93 పరుగులు.