IPL 2026: గిల్ సూపర్ సెంచరీ.. ఫైనల్‌కి దూసుకెళ్లిన గుజరాత్
- Naveen
- Updated on- May 29, 2026 / 11:35 PM IST
IPL 2026: గుజరాత్ టైటాన్స్ దుమ్మురేపింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది గుజరాత్. క్వాలిఫయర్ 2లో రాజస్తాన్ రాయల్స్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. 215 రన్స్ టార్గెట్ ను ఆడుతూ పాడుతూ చేజ్ చేసింది గుజరాత్. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ కొట్టింది.
ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. గిల్ 53 బంతుల్లో 104 రన్స్ చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. సుదర్శన్ 32 బాల్స్ లో 58 రన్స్ చేశాడు. గిల్, సాయి సుదర్శన్ ల జోడి.. గుజరాత్ ను విజయతీరాలకు చేర్చింది. వీరిద్దరూ తొలి వికెట్ కు 167 పరుగులు జోడించారు. 7 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది జీటీ. ఇక, మే 31న అహ్మదాబాద్ లో ఫైనల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది గుజరాత్ టైటాన్స్.
