IPL 2026: గర్జించిన గుజరాత్.. బెంగళూరు ఓటమి..
- Naveen
- Updated on- April 30, 2026 / 11:05 PM IST
IPL 2026: గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలోనే 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బ్యాటర్లు విఫలం అయ్యారు. జీటీ బౌలర్లు బెంబేలెత్తించారు. అర్షద్ ఖాన్ 3 వికెట్లతో చెలరేగాడు. రషీద్ ఖాన్, హోల్డర్ తలో 2 వికెట్లు తీశారు. సిరాజ్, రబాడా చెరో వికెట్ పడగొట్టారు. 156 రన్స్ టార్గెట్ ను గుజరాత్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. గిల్ (43), బట్లర్ (39), తెవాటియా (27) రాణించారు. ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలు సాధించిన ఆర్సీబీ.. గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు గుజరాత్ కు బ్యాక్ టు బ్యాక్ విజయం సాధించింది.
