Mumbai Indians : వార్నీ.. ముంబై గెల‌వాల‌ని కోరుకుంటున్న పంజాబ్, ఢిల్లీ, చెన్నై, కేకేఆర్‌.. చ‌రిత్ర‌లో తొలిసారి!.. పెద్ద క‌థే ఉంది

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ ఆదివారం (మే 24న‌) వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ పై (Mumbai Indians) గెలుపొందితే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.

IPL 2026, ipl playoffs, ipl playoffs scenario, Rajasthan Royals, Mumbai Indians (pic credit@ipl)

  • ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ చేరుకున్న మూడు జ‌ట్లు
  • మిగిలిన ఒక్క స్థానం కోసం 5 జ‌ట్ల మ‌ధ్య తీవ్ర పోటీ
  • రాజ‌స్థాన్ చివ‌రి మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు
  • ఆర్ఆర్ ఆడే చివ‌రి మ్యాచ్‌లో ముంబై గెల‌వాల‌ని మిగిలిన జ‌ట్ల ప్రార్థ‌న‌లు

Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆఖ‌రుకు వ‌చ్చేసింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ బెర్తుల‌ను ఖ‌రారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక స్థానం కోసం ఐదు జ‌ట్ల మ‌ధ్య తీవ్ర పోటీ ఉంది.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, పంజాబ్ కింగ్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు నాలుగో స్థానం కోసం తీవ్రంగా పోటీప‌డుతున్నాయి. మిగిలిన జ‌ట్ల‌తో పోలిస్తే రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు మంచి అడ్వాంటేజ్ ఉంది. మంగ‌ళ‌వారం ల‌క్నో పై విజ‌యం సాధించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌.. ఆదివారం (మే 24న‌) వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ పై గెలుపొందితే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.

అదే ఒక‌వేళ ముంబై చేతిలో రాజ‌స్థాన్ ఓడిపోతే.. అప్పుడు పంజాబ్ కింగ్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ల‌కు ప్లేఆఫ్స్ చేరుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. నెట్‌ర‌న్‌రేటు కీల‌కం కావొచ్చు.

రాజ‌స్థాన్ చివ‌రి మ్యాచ్‌లో ఓడిపోయి పంజాబ్ త‌మ చివ‌రి మ్యాచ్‌లో విజ‌యం సాధించి.. అదే స‌మ‌యంలో త‌మ చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో కోల్‌క‌తా ఓడిపోతే శ్రేయ‌స్ సేన ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

కోల్‌క‌తా ప‌రిస్థితి కూడా పంజాబ్ లాగే ఉంది. రాజ‌స్థాన్ చివ‌రి మ్యాచ్‌లో ఓడిపోయి.. అజింక్యా ర‌హానే నేతృత్వంలోని కేకేఆర్ జ‌ట్టు త‌మ చివ‌రి రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి, పంజాబ్ త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో ఓడిపోతే అప్పుడు ప్లేఆఫ్స్‌లో కోల్‌క‌తా అడుగుపెడుతుంది. ఒక‌వేళ పంజాబ్ ఆఖ‌రి మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు, పంజాబ్, కేకేఆర్ నెట్‌ర‌న్‌రేటు కీల‌కం అవుతుంది. మెరుగైన ర‌న్‌రేటు క‌లిగిన జ‌ట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది.

Vaibhav Sooryavanshi : ఏమో సార్‌.. నాకేం తెలియ‌దు.. వైభ‌వ్ సూర్య‌వంశీ కామెంట్స్‌.. నిజంగా నువ్వు చిన్న‌పిల్లాడివే అని నిరూపించావుగా..

ఇక పోతే.. సీఎస్‌కే, ఢిల్లీ జ‌ట్ల ప‌రిస్థితి ఒకే విధంగా ఉంది. ఈ రెండు జ‌ట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే త‌మ త‌మ ఆఖ‌రి మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించాలి. అదే స‌మ‌యంలో రాజ‌స్థాన్, పంజాబ్ త‌మ చివ‌రి మ్యాచ్‌ల్లో ఓడిపోవ‌డంతో పాటు కేకేఆర్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో క‌నీసం ఒక‌టి ఓడిపోవాలి అప్పుడే ఈ రెండు జ‌ట్ల‌కు అవ‌కాశం ఉంటుంది. అప్పుడు నెట్‌ర‌న్‌రేటు కీల‌కం అవుతుంది. మెరుగైన నెట్‌ర‌న్‌రేటు క‌లిగి జ‌ట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది.

అంటే.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌మ చివ‌రి మ్యాచ్‌లో ఓడిపోతేనే అప్పుడు ఢిల్లీ, పంజాబ్‌, సీఎస్‌కే, కేకేఆర్ జ‌ట్ల‌కు ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. అందుక‌నే ఆయా ఆయా జ‌ట్ల‌తో పాటు వాటి అభిమానులు కూడా ఆర్ఆర్ జ‌ట్టు చివ‌రి మ్యాచ్‌లో ఓడిపోవాల‌ని కోరుకుంటున్నారు. ముంబై ఇండియ‌న్స్ గెల‌వాల‌ని పూజ‌లు చేస్తున్నారు.