IPL 2026 : ఎస్ఆర్‌హెచ్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా టీమిండియా విధ్వంసకర బ్యాటర్..! ఇక రచ్చరచ్చే
IPL 2026 : ఐపీఎల్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ కమిన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 17, 2026 / 09:20 AM IST
Ishan Kishan, Pat Cummins
- ఐపీఎల్ టర్నీలో తొలి మ్యాచ్‌లకు ప్యాట్ కమిన్స్ దూరం
- కెప్టెన్సీ బాధ్యతలు ఇషాన్ కిషన్ చేపట్టే చాన్స్
- మరో ఇద్దరు క్రికెటర్ల పేర్లనూ పరిశీలిస్తున్న టీం యాజమాన్యం
IPL 2026 : ఐపీఎల్ -2026 కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకో రెండు వారాల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఆయా ప్రాంచైజీలు తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, ఐపీఎల్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతని స్థానంలో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ టోర్నీలో తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. గతేడాది వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్ సమయంలో వెన్ను భాగంలో గాయానికి గురైన కమిన్స్.. ఆ తరువాత ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఆ తరువాత టీ20 ప్రపంచకప్‌నకూ అతను దూరమయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు కమిన్స్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. దీంతో ఎస్ఆర్‌హెచ్ యజమాన్యం కమిన్స్ స్థానంలో టీమిండియా విధ్వంసకర బ్యాటర్, ఇటీవల టీ20 ప్రపంచకప్ విన్నింగ్ లో కీలక భూమిక పోషించిన ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇషాన్‌తోపాటు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ట్రావిస్ హెడ్, అభిషేక్ కంటే కెప్టెన్సీ బాధ్యతలకు ఇషాన్ కిషన్ సరిగ్గా సరిపోతాడని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ తన సారథ్యంలో తొలిసారి ఝార్ఖండ్ ను విజేతగా నిలిపాడు. అంతేకాదు.. భారత్ జట్టు టీ20 ప్రపంచకప్ విజయంలోనూ ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో కమిన్స్ తుది జట్టులో చేరే వరకు ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ద్వారా జట్టుకు మేలు జరుగుతుందని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం 2025 మెగా వేలంలో రూ.11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.
🚨 CAPTAIN ISHAN KISHAN FOR SRH 🚨
– Ishan Kishan is the front runner to be Captain of Sunrisers Hyderabad as there is no clarity on Pat Cummins. [Pratyush Raj] pic.twitter.com/YpL66263py
— Johns. (@CricCrazyJohns) March 16, 2026
