Cameron Green Run out : 25 కోట్లు నీళ్ల పాలు.. గ్రీన్ ర‌నౌట్‌లో త‌ప్పుఎవ‌రిది?

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ ఆట‌గాడు కామోరూన్ గ్రీన్ (Cameron Green Run out) దురదృష్టవశాత్తు ర‌నౌట్ అయ్యాడు.

IPL 2026 KKR vs SRH whos mistake in Cameron Green Run out video viral (pic credit@ipl)

  • వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ విఫ‌ల‌మైన కామెరూన్ గ్రీన్‌
  • మెగావేలంలో 25.20 కోట్ల‌కు కొనుగోలు చేసిన కేకేఆర్‌

Cameron Green Run out : ఐపీఎల్ వేలంలో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ప్లేయ‌ర్ల‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్ ఒక‌డు. వేలంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఏకంగా రూ.25.20 కోట్ల‌కు అత‌డిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2026లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తాడ‌ని కేకేఆర్ అత‌డిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. క‌ట్ చేస్తే.. జ‌రుగుతుంది వేరు.

ఐపీఎల్ 2026 ప్రారంభం నుంచి 12 రోజుల పాటు అత‌డు బౌలింగ్ చేసే అవ‌కాశం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది. కేవ‌లం బ్యాట‌ర్‌గానే కొన‌సాగించాల‌ని తెలిపింది. అత‌డు వెన్నుగాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని అంది. ఇక చేసేది లేక కేకేఆర్ జ‌ట్టు గ్రీన్‌ను బ్యాట‌ర్‌గానే ఆడిస్తోంది. పోనీ బ్యాటింగ్‌లోనైనా విధ్వంస‌కర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడా? అంటే అదీ లేదు.

Nitish Kumar Reddy : ఈ రోజు కోస‌మే ఎదురుచూస్తున్నా.. తెలుగు తేజం నితీశ్‌కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్‌..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడింది. కేకేఆర్ ఓడిపోయిన ఈ రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 10 బంతుల్లో 18 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గా.. గురువారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన రెండో మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు ర‌నౌట్ అయ్యాడు. రెండు బంతుల్లో రెండు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ర‌నౌట్‌లో త‌ప్పుఎవ‌రిది?

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు కేకేఆర్ బ‌రిలోకి దిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్‌ను ఇషాన్ మలింగ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి కేకేఆర్ బ్యాట‌ర్ ర‌ఘువంశీ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అయితే.. బంతి మ‌లింగ‌ కాలుకు త‌గిలి ఆగిపోయింది. దీన్ని గ‌మ‌నించ‌ని కామెరూన్ గ్రీన్ ప‌రుగు మొదలెట్టాడు. గ్రీన్ పిలుపుకు ర‌ఘువంశీ కాస్త ఆల‌స్యంగా స్పందించాడు. వీరిద్ద‌రు మ‌ధ్య‌లో కాస్త‌ త‌డ‌బాటుకు గురి అయ్యారు. చివ‌రకు ప‌రుగు తీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

వీరు ప‌రుగు తీసే లోపు బౌల‌ర్ మ‌లింగ బంతిని అందుకుని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. దీంతో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చిన ర‌ఘువంశీ క్రీజును చేర‌క‌పోవ‌డంతో తాను ర‌నౌట్ అయ్యాయ‌ని భావించి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. అయితే.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద అత‌డిని ఫోర్త్ అంపైర్ ఆపాడు. ఈలోగా రిప్లేను చూసిన థ‌ర్డ్ అంపైన్‌.. ర‌ఘువంశీ కాద‌ని, గ్రీన్ ర‌నౌట్ అయ్యాడ‌ని తేల్చాడు.

KKR vs SRH : కోల్‌క‌తా పై విజ‌యం.. నేను సంతోషంగా లేను.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

మ‌లింగ బెయిల్స్ ప‌డ‌గొట్టే స‌మ‌యానికి గ్రీన్‌, ర‌ఘువంశీ ఒక‌రినొక‌రు దాట‌లేదు. ఆ స‌మ‌యంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌కు బ్యాట‌ర్లు ఇద్ద‌రిలో గ్రీన్ స‌మీపంలో ఉన్నాడు. దీంతో గ్రీన్ ర‌నౌట్ అయ్యాడు.

ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. గ్రీన్ కాస్త చూసుకుని ఉంటే ఇలా జ‌రిగి ఉండేది కాద‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.