Nitish Kumar Reddy : ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా.. తెలుగు తేజం నితీశ్‌కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్..
కేకేఆర్ పై విజయంలో కీలక పాత్ర పోషించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డికి (Nitish Kumar Reddy) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
IPL 2026 Nitish Kumar Reddy comments after Player of the Match award in KKR vs SRH match (pic credit@IPL)
- ఐపీఎల్2026లో బోణీ కొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- విజయంలో కీలక పాత్ర పోషించిన నితీశ్‌కుమార్ రెడ్డి
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
Nitish Kumar Reddy : ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు గెలుపుబోణీ కొట్టింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్ విజయంలో ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy ) కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 39 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 2 రెండు పడగొట్టాడు. దీంతో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
అవార్డును అందుకున్న అనంతరం నితీశ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నాడు. ఇలాంటి రోజు (మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన) కోసమే తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు సరైన సమయంలో రాణించానని తెలిపాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించడం చాలా బాగుందన్నాడు.
గత కొన్నాళ్లుగా తాను ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా తాను సానుకూలంగా ఉన్నానని అన్నాడు. గత సీజన్ తాను అనుకున్నట్లుగా సాగలేదన్నాడు. గాయాలు ఇబ్బంది పెట్టాయని చెప్పుకొచ్చాడు.
బౌలింగ్ మెరుగుపరచుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. మధ్యలో కొంత విరామం దొరికింది. ఐపీఎల్ ఆరంభానికి ముందు బౌలింగ్‌పై బాగా కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతిఫలం మైదానంలో కనిపిస్తుంది. తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ట్రైనర్లు, ఫిజియోలకు కృతజ్ఞతలు తెలియజేశాడు నితీశ్‌కుమార్ రెడ్డి.
