IPL 2026: లక్నో పరాజయాల పరంపర.. వరుసగా 5వ ఓటమి.. సూపర్ ఓవర్‌లో కోల్ కతా ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
- Naveen
- Updated on- April 26, 2026 / 11:58 PM IST
IPL 2026: ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. వరుసగా 5వ ఓటమి చవి చూసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో లక్నో ఓటమి పాలైంది. సూపర్ ఓవర్ ద్వారా ఈ మ్యాచ్ ఫలితం తేలింది. స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఒక పరుగు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కోల్ కతా బౌలర్ సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్లను ఔట్ చేశాడు. 2 పరుగుల టార్గెట్ ను కోల్ కతా తొలి బంతికే చేజ్ చేసింది. రింకూ సింగ్ ఫోర్ కొట్టడం కోల్ కతా విజయదుంధుబి మోగించింది.
ఐపీఎల్ 2026 సీజన్ లో తొలిసారిగా ఓ మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ కు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్నో కూడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై అయ్యింది. చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా.. షమీ సిక్స్ బాదడంతో మ్యాచ్ టై అయ్యింది.
