IPL 2026: ఎట్టకేలకు బోణీ కొట్టిన కోల్‌కతా.. రాజస్తాన్ పై సూపర్ విక్టరీ

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 రన్స్ టార్గెట్ ను కేకేఆర్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.

  • Published on- April 19, 2026 / 07:58 PM IST

 

IPL 2026: ఎట్టకేలకు కోల్ కతా నైట్ రైడర్స్ గెలుపు బోణీ కొట్టింది. ఈ సీజన్ లో తొలి విజయం నమోదు చేసింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. గెలుపు అసాధ్యం అనుకున్న దశలో కేకేఆర్ సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 రన్స్ టార్గెట్ ను కేకేఆర్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. 4 వికెట్ల తేడాతో అనూహ్య విజయం నమోదు చేసింది. కేకేఆర్ తొలుత వరుసగా వికెట్లు కోల్పోయింది. 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రాజస్తాన్ గెలుపు ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ, రింకూ సింగ్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 34 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రింకూ సింగ్ తన బ్యాటింగ్ తో మ్యాచ్ ని మలుపుతిప్పాడు. చివరలో అనుకుల్ రాయ్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. రింకూ సింగ్, రాయ్ రాణించడంతో కేకేఆర్ విజయం సాధించింది. వీరి జోడి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఇదే తొలి విజయం. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఎట్టకేలకు విక్టరీ కొట్టింది. మరోవైపు రాజస్తాన్ కు ఇది వరుసగా రెండో పరాజయం.