Rishabh Pant : మా ఓటమికి అసలు కారణం అదే.. రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు.. ఈ సీనియర్ ప్లేయర్లు ఉన్నారే..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 13, 2026 / 08:55 AM IST
New ProjectAIPL 2026 LSG vs GT Rishabh Pant comments after Lucknow Super Giants lost match to Gujarat Titans (PIC CREDIT@IPL)
- వరుసగా మూడో విజయం సాధించాలనుకున్న లక్నోకు షాకిచ్చిన గుజరాత్
- రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్
- బ్యాటింగ్ వైఫల్యమే మా కొంపముంచింది
Rishabh Pant : ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించాలని భావించిన లక్నో సూపర్ జెయింట్స్ ఆశలపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ జట్టు (Rishabh Pant) పై శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో తాము ఓడిపోయామని పంత్ తెలిపాడు. బ్యాటర్లు ఇంకాస్త బాధ్యత తీసుకోవాలన్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఐడెన్ మార్‌క్రమ్ (30; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ నాలుగు వికెట్లు తీశాడు. అశోక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రబాడలు చెరో వికెట్ సాధించారు.
Virat Kohli : విరాట్ కోహ్లీ గాయంపై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్.. నిజం చెప్పాలంటే..
అనంతరం జోస్ బట్లర్ (60; 37 బంతుల్లో 11 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (56; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేయడంతో 165 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో బౌలర్లలో షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ లు తలా ఓ వికెట్ తీశారు.
బ్యాటింగ్ వైఫల్యమే మా కొంపముంచింది
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో లభించిన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. స్కోరు బోర్డుపై సరిపడినన్ని పరుగులు లేవు. వాళ్లు చాలా బాగా బౌలింగ్ చేశారు అన్న నిజాన్ని కాదనలేం. ఈ పిచ్ పై 170 నుంచి 180 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. అయితే.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధించలేకపోయాము. అని పంత్ అన్నాడు.
ALSO READ : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ముంబై పై ఒకే ఒక ఆటగాడు..
ఇక హోమ్ గ్రౌండ్‌లో ఓడిపోవడంపై గురించి ఈ పిచ్ పై 170 నుంచి 180 పరుగులు మంచి స్కోరు. అయితే.. మ్యాచ్ సమయంలో కొన్ని అవకాశాలు లభించాయి. అయితే.. వాటిని మేము అందిపుచ్చుకోలేకపోయామని అన్నాడు. ఇక తమ జట్టు బ్యాటింగ్ లైనప్ పై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదొ గొప్ప బ్యాటింగ్ లైనప్ అని అన్నాడు. టోర్నమెంట్ ఇప్పుడే ప్రారంభమైందన్నాడు. సీనియర్ ఆటగాళ్లకు ఏం చేయాలో తెలుసు. వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్వరలోనే వారు లయను కనుగొంటారని ఆశిస్తున్నాను. వారిపై నమ్మకం ఉంది అని రిషబ్ పంత్ తెలిపాడు.
