Angkrish Raghuvanshi fined : గెలుపు జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్.. ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఔట్‌గా రఘువంశీ.. భారీ జరిమానా విధించిన ఐపీఎల్ నిర్వాహకులు..
కేకేఆర్ ఆటగాడు అంగ్ర్కిష్ రఘువంశీకి ఐపీఎల్ నిర్వాహకులు (Angkrish Raghuvanshi fined) షాకిచ్చారు.
- Thota Vamshi Kumar
- Updated on- April 27, 2026 / 12:30 PM IST
IPL 2026 LSG vs KKR Angkrish Raghuvanshi has been fined 20% of his match fee (pic credit@ipl)
- అంగ్ర్కిష్ రఘువంశీకి షాకిచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు
- మ్యాచ్ ఫీజులో 20 జరిమానా
- అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత
Angkrish Raghuvanshi fined : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు 8 మ్యాచ్‌ల్లో ఇది రెండో విజయం కావడం గమనార్హం. కాగా.. గెలుపు జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్ తగిలింది.
ఆ జట్టు స్టార్ ఆటగాడు అంగ్ర్కిష్ రఘువంశీ కి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ జరిమానా విధించింది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతాన్ని జరిమానా విధించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. ఈ మ్యాచ్‌లో రఘువంశీ ఔటైన తరువాత ఐపీఎల్ ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించాడు. అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ కింద ఔట్ అయిన తరువాత పెవిలియన్‌కు వెలుతూ బౌండరీ లైన్ దాటిన తరువాత తన హెల్మెట్, బ్యాట్‌ను విసిరికొట్టాడు.
‘మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఫిక్స్చర్‌లు, ఫిట్టింగులను దుర్వినియోగం చేయడానికి సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను రఘువంశీ ఉల్లంఘించినట్లు తేలింది. ఈ ఘటన 5వ ఓవర్‌లో జరిగింది. అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రూల్ ద్వారా ఔట్ అయిన తరువాత రఘువంశీ పెవిలియన్‌కు వెలుతూ.. బౌండరీ కుషన్‌ను తన బ్యాట్‌తో కొట్టాడు. ఆ తరువాత తన హెల్మెట్‌ను తీసి డగౌట్‌లోకి విసిరివేశాడు. ఇది లెవల్ 1 నేరంగా పరిగణించబడుతోంది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నాం. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చాం. ఇక చేసిన తప్పు, విధించిన శిక్షను రఘువంశీ అంగీకరించాడు.’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
అసలేం జరిగిందంటే?
మ్యాచ్‌లో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ డకౌట్ కావడంతో అంగ్క్రిష్ రఘువంశీ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఈ ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతిని రఘవంశీ మిడాన్ దిశగా షాట్ ఆడి సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న గ్రీన్ సింగిల్ తీసేందుకు నిరాకరించాడు. దీంతో రఘువంశీ వెనుదిరగక తప్పలేదు.
The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔
What’s your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire !
What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026
అదే సమయంలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్‌లోని వికెట్ల వైపుగా బంతిని విసిరాడు. రఘువంశీ క్రీజును సమీపిస్తుండగా షమీ వేసిన బంతి అతడి కాళ్లకు తగిలింది. దీంతో అతడు కావాలనే బంతిని అడ్డుకున్నాడని ఆరోపిస్తూ షమీ, రిషబ్ పంత్ లు అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ కింద అతడు ఔట్ అని అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సాయం కోరారు.
పలు మార్లు రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్.. బ్యాటర్ పరిగెత్తే క్రమంలో కావాలనే దిశ మార్చుకున్నాడని, బంతిని వికెట్ కీపర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నాడని భావించాడు. ఈ క్రమంలో అబ్‌స్ట్రక్టింగ్ ఫీల్డ్ కింద అతడిని ఔట్‌గా ప్రకటించాడు. రఘువంశీ మైదానంలోని అంపైర్లతో వాదనకు దిగినా ఫలితం లేకపోయింది. చివరకు నిరాశగా పెవిలియన్‌కు వెలుతూ.. బౌండరీ లైన్ దాటిన తరువాత తన హెల్మెట్, బ్యాట్‌ను విసిరికొట్టాడు.
