LSG vs RCB : ఆర్‌సీబీతో లక్నోకు చావో రేవో.. ఓడిపోతే పంత్ సేన ఇంటికే..
లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు (గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs RCB ) తలపడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 7, 2026 / 12:34 PM IST
IPL 2026 LSG vs RCB Do or die match to Lucknow Super Giants today (pic credit@ipl)
- ఆర్‌సీబీతో లక్నోకు డూ ఆర్ డై మ్యాచ్
- ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి రిషబ్ సేన ఔట్
LSG vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చావో రేవో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు (గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక లక్నో ఓడిపోతే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.
ఇప్పటి వరకు లక్నో జట్టు 9 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేటు -1.076గా ఉంది. నేటి ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఓడిపోతే అప్పుడు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి ముఖం పడుతుంది.
Pat Cummins : పంజాబ్ పై విజయం.. ట్రావిస్ హెడ్ నిద్ర.. పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆర్‌సీబీతో మ్యాచ్ కాకుండా లక్నో జట్టు ఇంకో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా కూడా లక్నో ఖాతాలో 12 పాయింట్లే ఉంటాయి. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ 14, పంజాబ్ కింగ్స్ 13, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ జెయింట్స్‌లు తలా 12 పాయింట్లతో ఉన్నాయి.
ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఓడిపోయి మిగిలిన మ్యాచ్‌ల్లో లక్నో గెలిచినప్పటికి కూడా ఎస్ఆర్‌హెచ్, పంజాబ్, ఆర్‌సీబీలను ఎలాగూ దాటలేదు. ఎందుకంటే నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆర్‌సీబీ ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో రాజస్థాన్, గుజరాత్ జట్లు ఓ మ్యాచ్‌లో ముఖాముఖిగా తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు లక్నో కంటే ఎక్కువ పాయింట్లు సొంతం చేసుకుంటుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఆర్‌సీబీ, లక్నో జట్లు ముఖాముఖిగా ఏడు సందర్భాల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, లక్నో రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.
