IPL 2026: చెన్నైకి బిగ్ షాక్.. లక్నో సూపర్ విక్టరీ

తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

  • Updated on- May 15, 2026 / 11:18 PM IST

IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. చెన్నైపై లక్నో సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 188 రన్స్ టార్గెట్ ను లక్నో మరో 20 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 7 వికెట్లతో సీఎస్ కే ని చిత్తు చేసింది. లక్నో జట్టులో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 38 బంతుల్లోనే 90 పరుగులు బాదాడు. 7 సిక్సర్లు, 9 ఫోర్లు కొట్టాడు. చివరలో నికోలస్ పూరన్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి జట్టుని గెలిపించాడు.