Matthew Hayden : మాథ్యూ హేడెన్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా.. మ్యాచ్ తరువాత మైదానంలో.. వీడియో వైరల్
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden) చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : April 4, 2026 / 12:02 PM IST
IPL 2026 Matthew Hayden Wins Hearts after PBKS vs GT match he Picks Trash From Ground (pic credit@GT)
- మంగళవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్
- మ్యాచ్ అనంతరం మైదానంలో చెత్తను ఏరి గ్రౌండ్ స్టాఫ్ కు సాయం చేసిన గుజరాత్ బ్యాటింగ్ కోచ్
- మాథ్యూ హేడెన్ మంచి మనసును నెటిజన్లు ఫిదా
Matthew Hayden : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. మంగళవారం (మార్చి 31)న ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోయినప్పటికి ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden) చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంది.
మ్యాచ్ పూర్తి అయిన తరువాత మాథ్యూ హెడెన్ తమ డగౌట్, మైదానంలో ఆటగాళ్లు తాగి పడేసిన ఖాళీ వాటర్ బాటిళ్లు, చెత్తా, చెదాలను ఏరి గ్రౌండ్ స్టాఫ్ కు సాయం చేశాడు. అంతేకాదండోయ్ గ్రౌండ్ స్టాఫ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిలో ఒకరిని కౌగలించుకున్నాడు. వారి కృషిని, కష్టాన్ని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
That gesture won our hearts, Haydos! 🫶 pic.twitter.com/XCRO3vL8q0
— Gujarat Titans (@gujarat_titans) April 1, 2026
ఇక తాను చేసిన పనిపై హేడెన్ మాట్లాడుతూ.. గ్రౌండ్స్ అనేవి తన దృష్టిలో అద్భుతమైన ప్రదేశాలు అని అన్నాడు. ఇది కేవలం గౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఫ్రాంతాన్ని గౌరవించడం ముఖ్యం. గుజరాత్ టైటాన్స్‌లో మేము చేసేది అదే అని అన్నాడు.
ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు మాథ్యూహేడెన్ గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు. చెత్త వేసిన ఆటగాళ్లు, ప్రేక్షకులను కొందరు విమర్శిస్తున్నారు. హేడెన్ చేసిన పని మిగతా ఆటగాళ్లు సిగ్గుపడేలా చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
It’s actually putting you and the rest of the players to shame.
— Aristocrat (@RealJoy_Singh) April 2, 2026
We should be asking why are players and officials littering there?
It shouldn’t take a Hayden to teach us basic decency.— SA (@its_Smriti) April 1, 2026
