MI vs KKR : మ్యాచ్ జరుగుతుండగా ప్రియురాలికి ప్రపోజ్.. రింగ్ పోయింది.. కట్ చేస్తే..
ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు (MI vs KKR) తలపడ్డాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 31, 2026 / 11:26 AM IST
IPL 2026 MI Fan Loses Engagement Ring While Proposing To Girlfriend During MI vs KKR match
MI vs KKR : ఐపీఎల్ 2026లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఏం ఉందంటే.. అమ్మాయి కోల్‌కతా నైట్‌రైడర్స్ జెర్సీ వేసుకుని ఉండగా, అబ్బాయి ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి ఉన్నాడు. ఇక అతడు రింగ్ ఉన్న బాక్స్‌ను తెరిచి మోకాలి పై కూర్చోని ప్రపోజ్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. మోకాలిపై కూర్చోనే క్రమంలో అతడు కాస్త తడబడ్డాడు. ఈ క్రమంలో బాక్స్‌లోని రింగ్ కిందపడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వారు రింగ్ గురించి వెతకసాగారు. కొద్ది సేపటికి రింగ్ దొరికింది.
Shei Prothom Bhalobashar feeling 💜 pic.twitter.com/AtiWuB863m
— KolkataKnightRiders (@KKRiders) March 30, 2026
వెంటనే రింగ్‌ను అబ్బాయికి ఇవ్వగా.. అతడు మెకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌ను ఆమె అంగీకరించింది. వెంటనే అక్కడ ఉన్న వారు చప్పట్లు కొట్టారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
