Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక విదేశీ ప్లేయర్‌గా..
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine ) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 30, 2026 / 08:30 AM IST
IPL 2026 MI vs KKR Sunil Narine creates history
- సునీల్ నరైన్ అరుదైన ఘనత
- ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ప్లేయర్‌గా
- కీరన్ పొలార్డ్‌ను అధిగమించి
Sunil Narine : కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ ఆడడం ద్వారా నరైన్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు కీరన్ పొలార్డ్‌ను అధిగమించాడు.
2012లో ఐపీఎల్‌లో సునీల్ నరైన్ అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపుననే ఆడుతుండడం విశేషం. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ నరైన్‌కు ఐపీఎల్‌లో 190వ మ్యాచ్. కీరన్ పొలార్డ్ 189 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తరువాత రిటైర్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో నరైన్, పొలార్డ్ ల తరువాత ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్, బ్రావోలు ఉన్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన విదేశీ ఆటగాళ్లు వీరే..
* సునీల్ నరైన్ – 190 మ్యాచ్‌లు
* కీరన్ పోలార్డ్ – 189 మ్యాచ్‌లు
* ఏబీ డివిలియర్స్ – 184 మ్యాచ్‌లు
* డేవిడ్ వార్నర్ – 184 మ్యాచ్‌లు
* డ్వేన్ బ్రావో – 161 మ్యాచ్‌లు
ముంబైతో మ్యాచ్‌లో సునీల్ నరైన్ మూడు ఓవర్లు వేసి 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఓ వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
