MI vs PBKS : హార్దిక్ పాండ్యా ఆగ్ర‌హం, క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బుమ్రా, నిరాశ‌ను వ్య‌క్తం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. వీడియో

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు (MI vs PBKS )ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

IPL 2026 MI vs PBKS Rohit Sharma Jasprit Bumrah and Hardik Pandya visibly frustrated

  • పంజాబ్ మ్యాచ్‌లో క్యాచ్ మిస్ చేసిన బుమ్రా
  • హార్దిక్ పాండ్యా ఆగ్ర‌హం

MI vs PBKS : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. ఓ వైపు ఆట‌గాళ్ల గాయాలు, మ‌రోవైపు జ‌ట్టు వ‌రుస ఓట‌ముల‌తో ముంబై స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఈ సీజ‌న్‌లో రెండో విజ‌యం కోసం హారిక్ నేతృత్వంలోని ముంబై ఆశ‌గా ఎదురుచూస్తుంది.

ఇదిలా ఉంటే.. గురువారం వాంఖ‌డే వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా స‌హ‌నం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. మ్యాచ్‌లో ఓ ద‌శ‌లో రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, జ‌స్‌ప్రీత్ బుమ్రాలు త‌మ భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకోలేక‌పోయారు.

also read : ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్ గెల‌వ‌ని కోల్‌క‌తా.. అయినా గానీ ప్లేఆప్స్ కు ఛాన్సుందా.. నిజంగా ఇది అద్భుత‌మే..

పంజాబ్ ఇన్నింగ్స్ లో నాలుగో ఓవ‌ర్‌ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఈ ఓవ‌ర్‌లో తొలి బంతికి ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవ‌డంలో బుమ్రా విఫ‌లం అయ్యాడు. దీనిపై హార్దిక్ పాండ్యా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. బుమ్రా క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. ఆస‌మ‌యంలో అత‌డు అయోమయంగా, నిస్స‌హాయ స్థితిలో ఉన్న‌ట్లుగా క‌నిపించాడు. దీన్ని గ‌మ‌నించిన రోహిత్ శ‌ర్మ ఏం జ‌రుగుతుంది అన్న‌ట్లుగా తన నిరాశ‌ను వ్య‌క్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

గ‌త మ్యాచ్‌లో గాయ‌ప‌డడంతో రోహిత్ శ‌ర్మ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడ‌లేదు. మ‌రోవైపు బుమ్రా ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క వికెట్ కూడా తీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

also read : వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. ప్లేఆఫ్స్‌కు ముంబై ఎలా అర్హ‌త సాధించ‌వ‌చ్చో తెలుసా?

ఇక మ్యాచ్ విష‌యాని వ‌స్తే.. క్వింట‌న్ డికాక్ (112 నాటౌట్) శ‌త‌కం చేయ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 195 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు, మార్కో జాన్సెన్, శశాంక్ సింగ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ జ‌ట్టు 16.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (80 నాటౌట్ ), శ్రేయ‌స్ అయ్య‌ర్ (66) హాఫ్ సెంచ‌రీలు చేశారు.