Kolkata Knight Riders : ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవని కోల్‌కతా.. అయినా గానీ ప్లేఆప్స్ కు ఛాన్సుందా.. నిజంగా ఇది అద్భుతమే..
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు (Kolkata Knight Riders) ఏదీ కలిసి రావడం లేదు
Do you know KKR has still chance to qualify IPL 2026 Playoffs no win yet (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ గెలవని కోల్‌కతా
- అయినా గానీ ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉంది
- మిగిలిన 9 మ్యాచ్‌ల్లో ఎన్ని గెలవాలంటే
Kolkata Knight Riders : ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. ఇప్పటి వరకు ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ వచ్చి చేరింది. ఇక నెట్ రన్‌రేటు కూడా (-1.383)గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికి కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (Kolkata Knight Riders ) ఈ సీజన్లో ఇంకా ప్లేఆఫ్స్‌కు చేరే అద్భుత అవకాశం ఉంది. అయితే.. ఇందుకు ఆ జట్టు మిగిలిన మ్యాచ్‌లో తమ ప్రదర్శనను మెరుగు పరచుకోవడంతో పాటు అసాధారన ప్రదర్శన చేయాల్సి ఉంది.
ప్లేఆఫ్స్‌కు ఎలా చేరొచ్చంటే?
ఇప్పటి వరకు జరిగిన సీజన్లను పరిగణలోకి తీసుకుంటే 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. అంటే ఈ లెక్కన కోల్‌కతా జట్టు ఇంకో 15 పాయింట్లు సాధిస్తే సరిపోతుంది. అయితే.. ఇందుకు కోల్‌కతా 8 మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది.
ఈ సీజన్లో కోల్‌కతా ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఖచ్చితంగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 17 పాయింట్లు వచ్చి చేరతాయి. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా కేకేఆర్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
