IPL 2026: చెలరేగిన తిలక్ వర్మ.. ముంబై ఘన విజయం.. పంజాబ్ కు వరుసగా 5వ పరాజయం
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
- Naveen
- Updated on- May 14, 2026 / 11:30 PM IST
IPL 2026: పంజాబ్స్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. పంజాబ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 రన్స్ టార్గెట్ ను ముంబై మరో బంతి మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. ముంబై బ్యాటర్లలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
33 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. చివరి వరకు క్రీజులో నిలబడి ముంబై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు తిలక్ వర్మ. ఈ టోర్నీ నుంచి ఇప్పటికే ముంబై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ కు ఇది వరుసగా 5వ పరాజయం. తొలుత ఓటమి అన్నది లేకుండా రాణించిన పంజాబ్.. ఇప్పుడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
