IPL 2026: ఎట్టకేలకు ముంబై గెలిచింది.. గుజరాత్ పై ఘన విజయం
గుజరాత్ తో మ్యాచ్ లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 90 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో వచ్చిన వర్మ.. చెలరేగి ఆడాడు.
- Naveen
- Updated on- April 20, 2026 / 11:16 PM IST
Pic Courtesy @ EspnCricInfo
IPL 2026: ఎట్టకేలకు ముంబై ఫామ్ లోకి వచ్చింది. నాలుగు వరుస ఓటముల తర్వాత గెలుపు సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. గుజరాత్ పై ఘన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 రన్స్ టార్గెత్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 15.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 99 పరుగుల తేడాతో ముంబై విజయదుంధుబి మోగించింది.
ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్ లో ముంబైకి ఇది రెండో విజయం. అటు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరు మీదున్న గుజరాత్ కు ముంబై షాక్ ఇచ్చింది. మూడు వరుస విజయాల తర్వాత ఓటమి పాలైంది గుజరాత్. ఈ సీజన్ లో గుజరాత్ కు ఇది మూడో పరాజయం.
గుజరాత్ తో మ్యాచ్ లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 90 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో వచ్చిన వర్మ.. చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 7 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టాడు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో భారీ స్కోర్ (199) చేయగలిగింది.
