Riyan Parag : చిక్కుల్లో రియాన్ ప‌రాగ్‌.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇ-సిగ‌రేట్ తాగుతూ కెమెరాకి.. వీడియో వైర‌ల్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) చిక్కుల్లో పడ్డాడు.

IPL 2026 PBKS vs RR Riyan Parag caught vaping inside dressing room

  • చిక్కుల్లో రియాన్ ప‌రాగ్‌
  • పంజాబ్, రాజ‌స్థాన్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్

Riyan Parag : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. మంగ‌ళ‌వారం న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ 6 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్‌లో పంజాబ్ కు ఇదే తొలి ఓట‌మి.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిస్ (62 నాటౌట్; 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (59; 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. కూపర్ కొన్నోలీ (30; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ప్రియాన్ష్ ఆర్య (29; 11 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో యశ్ రాజ్ పుంజా రెండు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చ‌ర్‌, నాండ్రే బ‌ర్గ‌ర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Sneh Rana : కేదార్‌నాథ్‌లో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌.. శివ‌య్యను ద‌ర్శించుకున్న స్నేహ్‌రాణా

అనంత‌రం 223 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 19.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో డోనోవన్ ఫెరీరా (52 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్ (51; 27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు హాఫ్ సెంచ‌రీలు చేశారు. వైభ‌వ్ సూర్య‌వంశీ (43 ; 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), శుభమ్ దుబే (31 నాటౌట్; 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) వేగంగా ఆడారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో యుజ్వేంద్ర చాహ‌ల్ మూడు, అర్ష్‌దీప్ సింగ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

రియాన్ ప‌రాగ్ ఇదేంద‌య్యా..

ఇదిలా ఉంటే.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇన్నింగ్స్ జ‌రుగుతుండ‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ ప‌రాగ్‌ వేపింగ్ (ఇ-సిగ‌రేట్‌) చేస్తూ క‌నిపించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌లో ధ్రువ్ జురెల్, య‌శ‌స్వి జైస్వాల ప‌క్క‌న ఉండ‌గానే ప‌రాగ్ ఇ సిగ‌రేట్ తాగుతూ క‌నిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Vaibhav Sooryavanshi : వైభ‌వ్ ఏంది నీ వైభోగం.. ఆ డిమాండ్ ఏంద‌య్యా.. ఫోటోకు 100 రూపాయ‌ల.. వామ్మో..

అధికృత ప్రాంతాలు మిన‌హా, ఛేజింగ్ రూమ్‌ల‌లో లేదా మైదానాల్లో ధూమ‌పానంకు అనుమ‌తి లేదు. అదే స‌మ‌యంలో 2019 నుంచి భార‌త్‌లో ఇ సిగ‌రేట్ల విక్ర‌యం, వాడ‌కం పైనా నిషేదం ఉంది. ఒక‌వేళ ప‌రాగ్ ఇ సిగ‌రేట్ తాగాడ‌ని తేలితే మాత్రం భారతదేశం ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) 2019 కింద అత‌డికి శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష, భారీ జ‌రిమానా విధించ‌బ‌డ‌తాయి. అంతేకాకుండా బీసీసీఐ కూడా అత‌డిపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.