IPL 2026: చెలరేగిన శ్రేయస్ అయ్యర్.. హైదరాబాద్ పై పంజాబ్ ఘన విజయం.. భారీ స్కోర్ చేసినా..
220 పరుగుల టార్గెట్ ను పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది.
- Naveen
- Published On : April 11, 2026 / 07:33 PM IST
IPL 2026: సన్ రైజర్స్ హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. భారీ స్కోర్ ని సైతం ఎంతో ఈజీగా చేజ్ చేసి హైదరాబాద్ పై ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను చిత్తు చేసింది పంజాబ్. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. 220 పరుగుల టార్గెట్ ను పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది.
బౌలింగ్ లో హైదరాబాద్ తేలిపోయింది. బౌలింగ్ లో వైఫల్యం కారణంగా చిత్తుగా ఓడింది. 219 పరుగుల భారీ స్కోర్ ను కూడా హైదరాబాద్ డిఫెండ్ చేసుకోలేకపోయింది. పేలవమైన బౌలింగ్ తో చేతులారా ఓటమి పాలైంది. హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
ప్రియాంశ్ (57), ప్రభ్ సిమ్రన్ సింగ్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు. ఈ సీజన్ లో పంజాబ్ కు తిరుగు లేదు. ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుపు సాధించింది. నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు. మరోవైపు హైదరాబాద్ కు ఇది మూడో పరాజయం. నాలుగు మ్యాచ్ లు ఆడగా ఒక దాంట్లో మాత్రమే గెలిచింది.
