IPL 2026: తిరుగులేని పంజాబ్.. లక్నోపై ఘన విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లు సిక్సర్లు సునామీ సృష్టించారు.

  • Updated on- April 19, 2026 / 11:23 PM IST

IPL 2026: ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ ఖాతాలో మరో విజయం చేరింది. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో పంజాబ్ దుమ్ము రేపింది. లక్నో పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లు సిక్సర్లు సునామీ సృష్టించారు. పరుగుల వరద పారించారు. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ (87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 255 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 54 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది వరుసగా 5వ విజయం. ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుపొందింది. ఒక్క ఓటమి కూడా లేదు. అటు లక్నో జట్టుకి హ్యాట్రిక్ పరాజయం.