IPL 2026: ముంబైపై విజయం.. ప్లేఆఫ్స్ కు రాజస్తాన్ రాయల్స్

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

  • Updated on- May 24, 2026 / 07:56 PM IST

IPL 2026: ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ రాణించింది. ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడంలో ముంబై విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 30 పరుగుల తేడాతో ఆర్ఆర్ విక్టరీ కొట్టింది. రాజస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. ముంబై టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ చెలరేగిపోయాడు. మూడు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు. బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అర్థ శతకం చేసినా.. జట్టుకి ఓటమిని తప్పించలేకపోయాడు.

ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. ముంబైతో విక్టరీతో రాజస్తాన్ టాప్ లో చోటు సంపాదించింది. దీంతో ఇప్పటివరకు రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటికే మూడు జట్లు (ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్, జీటీ) ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఇక ఫ్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన నాలుగో జట్టుగా ఆర్ఆర్ నిలిచింది.