RCB vs LSG : కోహ్లీ కానేకాదు.. మేం గెలిచింది వారి వల్లే.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్..
లక్నో పై విజయం సాధించడం పట్ల ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (RCB vs LSG) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 16, 2026 / 08:06 AM IST
IPL 2026 Rajat Patidar comments after RCB vs LSG match (pic credit@ipl)
- లక్నో పై విజయం
- స్పందించిన ఆర్‌సీబీ కెప్టెన్
- బౌలర్ల అసాధారణ ప్రదర్శన వల్లే గెలిచామన్న రజత్ పాటిదార్
RCB vs LSG : ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతుంది. బుధవారం చిన్నస్వామి వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు పై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బౌలర్ల అసాధారణ ప్రదర్శన, అద్భుత ఫీల్డింగ్ వల్లే తాము విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ప్రస్తుతానికి కప్పు పై తమ దృష్టి లేదన్నాడు. కేవలం ఒక్కొ మ్యాచ్‌పైనే తమ దృష్టి ఉందన్నాడు.
మిచెల్ మార్ష్ (40; 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని (38; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ముకుల్ చౌదరి (39; 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ నాలుగు, భువనేశ్వర్ కుమార్ మూడు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ ఓ వికెట్ తీశారు.
అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆర్‌సీబీ ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (49; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. రజత్ పాటిదార్ (27; 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), జితేశ్ శర్మ(23; 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
బౌలర్లపై ప్రశంసల వర్షం
మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టాస్ గెలవడం తమకు కలిసి వచ్చిందన్నాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న పేసర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారన్నారు. కృనాల్ పాండ్యా గురించి మాట్లాడుతూ.. అతడు ఎలాంటి బంతులు వేస్తాడు అనే విషయం తనకు తెలియదన్నాడు. అతడు చాలా తెలివైన బౌలర్ అని చెప్పుకొచ్చాడు.
ALSO READ : 1 రన్ తేడాతో కోహ్లీ 66 హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్..
సుయాష్ శర్మ స్టంప్-టు-స్టంప్ బౌలింగ్ చేయడం చూసేందుకు అద్భుతంగా ఉందన్నాడు. ఇక భువీ, జోష్ హేజిల్‌వుడ్ జోడీ గురించి మాట్లాడుతూ వారిద్దరూ అదరగొట్టారన్నాడు. కొత్త బంతితో వారు బౌలింగ్ వేసిన విధానం చాలా బాగుందన్నాడు. ఇలాంటి స్పెషలిస్ట్ బౌలర్లు తమ జట్టులో ఉండడంతో తన పని చాలా తేలిక అవుతుందన్నాడు. వారికి ఏమీ చేయాలో చెప్పాల్సిన పని లేదన్నాడు. వారి అనుభవం, ఆలోచనలు జట్టులోని మిగిలిన బౌలర్లు అందరికి సాయపడుతాయన్నాడు.
ఆర్‌సీబీ ఫీల్డింగ్ గురించి మాట్లాడుతూ.. ఐపీఎల్ ప్రారంభం నుంచే తాము ఫీల్డింగ్ పై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామన్నాడు. దానికి తగ్గట్టుగానే ఫిల్ సాల్ట్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడని ప్రశంసించాడు. వాస్తవానికి అతడు గాలిలో ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌లు పడతాడని, ఈ రోజు పట్టిన క్యాచ్ నిజంగా గొప్పదన్నాడు. ప్రస్తుతానికి టైటిల్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇది సుదీర్ఘ టోర్నీ అని, ఒక్కొ మ్యాచ్‌పైనే తమ దృష్టి ఉందని రజత్ పాటిదార్ తెలిపాడు.
