Rajat Patidar : గెలిచేందుకు ఆడలేదు.. మా లక్ష్యం అదే.. రజత్ పాటిదార్ కామెంట్స్ వైరల్..
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 23, 2026 / 09:49 AM IST
IPL 2026 Rajat Patidar key comments after SRH vs RCB match (pic credit@ipl)
- సన్‌రైజర్స్ పై ఓటమి
- స్పందించిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్
- గెలుపు కోసం కాదు దాని కోసమే ఆడామని కామెంట్స్
Rajat Patidar : పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని భారీ లక్ష్యాన్ని తమ ముందు ఉంచారన్నాడు. స్లో బౌన్సర్లు, యార్కర్లతో తమను కట్టడి చేశారని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్ (51)లు అర్థశతకాలు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు సాధించింది. బెంగళూరు బౌలర్లలో రసిఖ్ సలాం దార్ రెండు వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యాలు చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. ఆర్‌సీబీ బ్యాటర్లలో రజత్ పాటిదార్ (56) అర్ధశతకం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ (44) , కృనాల్ పాండ్యా (41 నాటౌట్) రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లు చెరో వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికి కూడా ఆర్‌సీబీ మెరుగైన నెట్‌రన్‌రేటును కలిగి ఉండడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుని క్వాలిఫయర్ -1 బెర్తును ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-5 బ్యాటర్లు చాలా బాగా ఆడారని, వారు తమ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారని, తొలి ఇన్నింగ్స్‌లో వారు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారని అన్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ ఏమైనా నెమ్మదించిందా అనే ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చాడు. అయితే.. ఆర్‌సీబీ బౌలర్లు స్లో బౌన్సర్లు, ఖచ్చితమైన యార్కర్లతో తమని ఇబ్బంది పెట్టారన్నాడు. వారు ప్రణాళికలను చక్కగా అమలు చేశారన్నాడు. ఏదీఏమైనప్పటికి కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే తమ మొదటి ప్రణాళిక అని అందుక తగ్గట్లుగానే ఆడామన్నాడు. ఈ పిచ్ పై 255 భారీ స్కోరు అని అన్నాడు. అయితే.. స్లో బౌన్సర్లు వేయడంతో బ్యాటర్లకు షాట్లు ఆడడం కష్టమైందని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 255 పరుగులు చేయగా.. 166 పరుగుల లోపు ఆర్‌సీబీని కట్టడి చేసి ఉంటే ఎస్ఆర్‌హెచ్ టాప్-2లో నిలిచేది. 178 పరుగులు సాధిస్తే తమ నెట్‌రన్‌రేటు పడిపోకుండా అగ్రస్థానాన్ని కాపాడుకోవచ్చునని తెలిసిన ఆర్‌సీబీ అందుకు తగ్గట్లుగానే ఆడింది.
