Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఏకైక ఆట‌గాడు.. ఒక‌టి కాదు రెండు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) చ‌రిత్ర సృష్టించాడు.

IPL 2026 RCB vs GT Virat Kohli Scripts History Achieves Two Records (pic credit@ipl)

  • గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో 81 ప‌రుగులు చేసిన కోహ్లీ
  • ఈ క్ర‌మంలో ప‌లు రికార్డులు బ్రేక్‌
  • ఐపీఎల్‌లో 800 ఫోర్లు కొట్టిన తొలి ఆట‌గాడిగా
  • ఆర్‌సీబీ త‌రుపున 300 సిక్స‌ర్లు బాదిన ప్లేయ‌ర్‌గా

Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 800 ఫోర్లు కొట్టిన తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. శుక్ర‌వారం చిన్న‌స్వామి వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. క‌గిసో ర‌బాడా బౌలింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌లో త‌న తొలి బౌండ‌రీ సాధించ‌డంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక ఫోర్లు సాధించిన జాబితాలో కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శిఖ‌ర్ ధావ‌న్, డేవిడ్ వార్న‌ర్‌, రోహిత్ శ‌ర్మ‌లు ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితా ఇదే..

* విరాట్ కోహ్లీ – 807 ఫోర్లు
* శిఖర్ ధావన్ – 768 ఫోర్లు
* డేవిడ్ వార్నర్ – 663 ఫోర్లు
* రోహిత్ శర్మ – 653 ఫోర్లు
* అజింక్య రహానే – 522 ఫోర్లు

Akash Ambani : ముంబై ఇన్నింగ్స్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన ఆకాశ్ అంబానీ.. వెళ్తూ వెళ్తూ సైగ‌లు చేశాడు చూడండి.. వామ్మో..

300 సిక్స‌ర్లు..

కోహ్లీ మ‌రో ఘ‌న‌త‌ను కూడా అందుకున్నాడు. ఆర్‌సీబీ త‌రుపున 300 సిక్స‌ర్లు కొట్టిన తొలి ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇక ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో ఈ మైలురాయిని చేరుకున్న మూడో ఆట‌గాడిగా నిలిచాడు. క్రిస్ గేల్‌, రోహిత్ శ‌ర్మ అత‌డిక‌న్నా ముందు ఈ మైలురాయిని చేరుకున్నారు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

* క్రిస్‌గేల్ – 142 మ్యాచ్‌ల్లో 357 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ – 276 మ్యాచ్‌ల్లో 310 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 274 మ్యాచ్‌ల్లో 303 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని – 278 మ్యాచ్‌ల్లో 264 సిక్స‌ర్లు
* ఏబీ డివిలియ‌ర్స్ – 184 మ్యాచ్‌ల్లో 251 సిక్స‌ర్లు

Sachin birthday : తండ్రి స‌చిన్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పి కేక్ తినేందుకు నిరాక‌రించిన అర్జున్ టెండూల్క‌ర్‌..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 44 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 81 ప‌రుగులు సాధించాడు.