Ajinkya Rahane : ఆ ఒక్క త‌ప్పే మా కొంప‌ముంచింది.. కేకేఆర్ కెప్టెన్ ర‌హానే కీల‌క కీల‌క వ్యాఖ్య‌లు..

ఫీల్డింగ్ వైఫ‌ల్యాలే త‌మ కొంప‌ముంచాయ‌ని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా ర‌హానే (Ajinkya Rahane) వెల్ల‌డించారు.

IPL 2026 RCB vs KKR highlights Ajinkya Rahane Comments after the match (pic credit@ipl)

  • ఆర్‌సీబీ పై ఓట‌మి
  • కేకేఆర్ కెప్టెన్ ర‌హానే కామెంట్లు

Ajinkya Rahane : రాయ్‌పూర్ వేదిక‌గా బుధ‌వారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఓడిపోయింది. దీంతో ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్ అవ‌కాశాలు సంక్లిష్టం అయ్యాయి. ఈ పిచ్ పై 192 ప‌రుగులు నిజానికి మంచి స్కోరు అని కేకేఆర్ కెప్టెన్ అజింక్యా ర‌హానే అభిఫ్రాయ‌ప‌డ్డాడు. త‌మ జ‌ట్టు ఓట‌మికి ఫీల్డింగ్ వైఫ‌ల్యాలే కార‌ణం అని తెలిపాడు.

అంగ్ర్కిష్ రఘువంశీ (71; 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా రింకూ సింగ్ (49 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ) వేగంగా ఆడ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌, రసిఖ్ సలాం దార్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Virat Kohli : టీ20ల్లో కోహ్లీని కొట్టేవాడే లేడు.. గేల్, బ‌ట్ల‌ర్‌, వార్న‌ర్ రికార్డులు ఔట్‌.. ఏకైక భార‌త ఆట‌గాడు..

అనంతరం విరాట్ కోహ్లీ (105 నాటౌట్; 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అజేయ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో 193 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 19.1 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో కార్తీక్ త్యాగి మూడు వికెట్లు తీశాడు. సునీల్ న‌రైన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్యార‌హానే స్పందించాడు. ఫీల్డింగ్ వైఫ‌ల్య‌మే త‌మ కొంప ముంచింద‌న్నాడు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయ‌ర్ క్యాచ్‌ను వ‌దిలివేయ‌డం మ్యాచ్ ఫ‌లితాన్నే మార్చివేసింద‌న్నాడు. గ‌త మూడు నాలుగు మ్యాచ్‌ల్లో త‌మ జ‌ట్టు ఫీల్డింగ్ బాగుంద‌ని, అయితే.. ఈ రోజు కీల‌క స‌మ‌యంలో క్యాచ్‌లు మిస్ కావ‌డం ఘోరంగా దెబ్బ‌తీసింద‌న్నాడు.

ఈ పిచ్ పై 190 ప‌రుగులు మంచి స్కోరు అని, కొత్త బ్యాట‌ర్ల‌కు ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయ‌డం అంత సుల‌భం కాద‌న్నాడు. ఒక‌వేళ కోహ్లీని ఔట్ చేసి ఉంటే మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. విరాట్ కోహ్లీ, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల మ‌ధ్య భాగ‌స్వామ్యం మ్యాచ్‌ను ముల‌పు తిప్పింద‌న్నాడు. వీరిద్ద‌రి అడ్డుకోవ‌డంలో తాము విఫ‌లం అయ్యామ‌ని తెలిపాడు. మ‌ధ్య ఓవ‌ర్ల‌లో త‌మ స్పిన్న‌ర్లు వికెట్లు తీస్తార‌ని భావించాన‌ని, అయితే.. ఆర్‌సీబీ బ్యాట‌ర్లు వారిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నార‌న్నాడు.

మూడు వికెట్లు తీసిన యువ బౌల‌ర్ కార్తీక్ త్యాగి పై ర‌హానే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అత‌డికి స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న విధానం ఉంద‌న్నాడు. ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేసేందుకు అత‌డు ఎంతో శ్ర‌మిస్తాడ‌ని తెలిపాడు.