IPL 2026 : బాబోయ్.. కోహ్లీకే దిమ్మతిరిగే షాకిచ్చిన యువ బౌలర్.. సర్రుమంటూ దూసుకొచ్చింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
IPL 2026 : ఆర్సీబీకి బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీకి లక్నో యువ బౌలర్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. దీంతో కోహ్లీ డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Harish Thanniru
- Updated on- May 8, 2026 / 07:15 AM IST
IPL 2026 RCB vs LSG Match Virat Kohli left shocked by Prince Yadavs stunning delivery video viral
- ఆర్సీబీపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
- లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ సూపర్ బౌలింగ్
- అద్భుత బంతితో కోహ్లీని క్లీన్‌బౌల్డ్ చేసిన ప్రిన్స్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించింది. డీఎల్ఎస్ పద్దతి ప్రకారం లక్నో జట్టు తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read : Pat Cummins : పంజాబ్ పై విజయం.. ట్రావిస్ హెడ్ నిద్ర.. పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించారు. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ జట్టు విఫలమైంది. ఆ జట్టు బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ కావడంతో నిర్ణీత 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 203 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో లక్నో జట్టు విజేతగా నిలిచింది. వరుస ఓటములతో తల్లడిల్లిన ఆ జట్టుకు ఎట్టకేలకు తాజా విజయంతో ఉపశమనం లభించినట్లయింది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీకి లక్నో యువ బౌలర్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. దీంతో కోహ్లీ డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాల్సి వచ్చింది. లక్నో యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. అందులో విరాట్ కోహ్లీ వికెట్ ఒకటి. మ్యాచ్ రెండో ఓవర్ ప్రిన్స్ యాదవ్ వేయగా.. ఆ ఓవర్లో రెండో బంతికి విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి సర్రుమంటూ దూసుకొచ్చి వికెట్లను పడగొట్టింది. దీంతో బంతి ఎటునుంచి వచ్చిందో అర్ధంకాక విరాట్ కోహ్లీసైతం షాక్‌కు గురయ్యాడు. తాను ఎలా ఔట్ అయ్యాను అన్నట్లుగా అశ్చర్యం వ్యక్తం చేస్తూ క్రీజును వదిలి పెవిలియన్ బాటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోహ్లీని క్లీన్‌బౌల్డ్ చేసిన తరువాత ప్రిన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. మైదానంలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
𝗣𝗿𝗶𝗻𝗰𝗲 𝗴𝗲𝘁𝘀 𝘁𝗵𝗲 𝗞𝗶𝗻𝗴 😮 \|/
🎥 An absolute peach of a delivery from the young fast bowler to rattle the stumps 💥
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/YlxbQO9Oma
— IndianPremierLeague (@IPL) May 7, 2026
