Andy Flower : ముంబై పై విజయం.. ఆర్‌సీబీ పై బీసీసీఐ చర్యలు షురూ.. హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ప్లవర్ పై (Andy Flower) ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.
- Thota Vamshi Kumar
- Updated on- May 11, 2026 / 10:43 AM IST
IPL 2026 RCB vs MI Royal Challengers Bengaluru Head coach Andy Flower has been fined 15 percent of his match fee
- గెలుపు జోష్‌లో ఉన్న ఆర్‌సీబీకి షాక్
- హెడ్ కోచ్‌కు 15 శాతం జరిమానా
Andy Flower : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే.. గెలుపు జోష్‌లో ఉన్న ఆర్‌సీబీకి షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ప్లవర్ పై ఐపీఎల్ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.
మ్యాచ్ సమయంలో ఆండీ ప్లవర్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడని ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1 ఉల్లంఘన కిందకు వస్తుందని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 17.2వ ఓవర్‌లో ఆండీ, ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదం జరిగింది. ఇక చేసిన తప్పును మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను ఆండీ అంగీకరించాడని దీనిపై తదుపరి ఎలాంటి విచారణ ఉండదని తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
ఆర్‌సిబి బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌లో రెండో బంతికి ఈ సంఘటన జరిగింది. కృనాల్ పాండ్యా భారీ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. బౌండరీ లైన్ వద్ద నమన్ దీర్ బంతిని పట్టుకున్నాడు. అయితే.. అతడు బౌండరీ లైన్ దాటుతుండడంతో వెంటనే బంతిని మైదానంలోని తిలక్ వర్మ వైపుకు విసిరివేశాడు. దీన్ని అంచనా వేయలేని తిలక్ క్యాచ్‌ను జారవిడిచాడు.
ఇక దీన్ని సిక్స్ ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించడానికి అంపైర్లు చాలా సమయం తీసుకున్నారు. అయితే.. నమన్ బౌండరీ లైన్ తాకలేదని స్పష్టంగా కనిపించడంతో సిక్స్ ఇవ్వలేదు. ఈ విషయంపైనే ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ప్లవర్ నాలుగో అంపైర్‌తో వాగ్వాదం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (57; 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ దీర్ (47; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్, రొమారియో షెపర్డ్ లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం కృనాల్ పాండ్యా (73; 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్థశతకంతో రాణించడంతో 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అందుకుంది.
