Hardik Pandya : ముంబైలో ఏం జరుగుతోంది ? రోహిత్, సూర్య ఖాతాలను అన్‌ఫాలో చేసిన పాండ్యా? ముంబై పోస్టులు మొత్తం డిలీట్..?
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకోపోవడంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారని, దీంతో అతడు ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేశాడని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
Did Hardik Pandya Unfollow Mumbai Indians On Instagram
- ఆర్సీబితో ఓటమి
- ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
- కెప్టెన్సీ నుంచి హార్దిక్‌ను తొలగించారని, దీంతో అతడు ముంబై అన్‌ఫాలో చేశాడని రూమర్లు
Hardik Pandya : ఐపీఎల్ 2026లో ఆదివారం రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబైఇండియన్స్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్ర్కమించింది. దీంతో ముంబై జట్టు పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేయడంతో ముంబై జట్టు హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతలను నుంచి తప్పించిందనే వదంతులు వ్యాపించాయి. కాగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో పాండ్యా ఆడలేదు.
అయితే.. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యా అన్‌ఫాలో చేశాడని, అంతేకాకుండా ఫ్రాంఛైజీతో ఉన్న పోస్టులు అన్నింటిని డిటీల్ చేశాడని, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు పలువురు కీలక సహచరులను అన్‌ఫాలో చేసినట్లు వార్తలు వచ్చాయి.
Hardik Pandya has unfollowed Mumbai Indians on Instagram.👀 pic.twitter.com/dxQVnEapXd
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 10, 2026
నిజంగానే హార్దిక్ అన్‌ఫాలో చేశాడా?
ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన వెంటనే పాండ్యా ముంబై ఇండియన్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడని అంటున్నారు. అయితే.. అతడు ముంబైని అన్‌ఫాలో చేశాడు అనే విషయం వైరల్ అవ్వడంతో వెంటనే మళ్లీ ఫాలో చేశాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని స్ర్కీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై క్లారిటీ లేదు. ముంబై ఇండియన్స్‌తో కలిసి చేసిన కొలాబ్ వీడియోలు అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇంకా అందుబాటులోనే ఉండడం గమనార్హం.

కనిపించని సూర్య, రోహిత్..
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. ఈ ప్రక్రియ సంక్లింగా సాగిందని, ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్, పాండ్యాకు మధ్యలో విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిని అప్పట్లోనే ఫ్రాంఛైజీ ఖండించింది.

హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో 151 మంది ఫాలో అవుతున్నాడు. అయితే.. అతడి ఫాలోవర్లలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు లేరు. అయితే.. వీరిద్దరి గతంలో అతడు ఫాలో చేశాడో లేదో స్పష్టంగా తెలియదు. కాగా.. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలను హార్దిక్ పాండ్యా ఫాలో అవుతున్నాడు.
