RCB vs SRH : స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌.. చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మైన భువ‌నేశ్వ‌ర్ కుమార్‌

ఐపీఎల్ 2026 సీజ‌న్ శ‌నివారం (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు (RCB vs SRH) త‌ల‌ప‌డ‌నున్నాయి.

IPL 2026 RCB vs SRH Bhuvneshwar Kumar need 2 more to reach 200 ipl wickets

  • మార్చి 28 నుంచి ఐపీఎల్‌
  • తొలి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్న ఆర్‌సీబీ, స‌న్‌రైజ‌ర్స్‌
  • అరుదైన రికార్డుపై భువీ క‌న్ను

RCB vs SRH : ఐపీఎల్ 2026 సీజ‌న్ శ‌నివారం (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను ఓ అరుదైన ఘ‌న‌త ఊరిస్తోంది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో (RCB vs SRH) భువీ రెండు వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 200 వికెట్లు తీసిన తొలి పేస‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు.

2011లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇప్ప‌టి వ‌ర‌కు 190 మ్యాచ్‌లు ఆడాడు. 27.33 స‌గ‌టుతో 198 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌, మ‌రో రెండు సార్లు నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఉప్ప‌ల్ మైదానంలో ఎన్ని మ్యాచ్‌లు అంటే..?

ఇక ఓవ‌రాల్‌గా ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో భువీ రెండో స్థానంలో ఉన్నాడు. 221 వికెట్లు యుజ్వేంద్ర చాహ‌ల్ తొలి స్థానంలో ఉన్నాడు.

ఇక పేస‌ర్ల విష‌యానికి వ‌స్తే.. భువీ అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా కొన‌సాగుతుండ‌గా ఆ త‌రువాతి స్థానంలో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. బుమ్రా 183 వికెట్లు తీశాడు. 161 వికెట్ల‌తో డ్వేన్ బ్రావో మూడో స్థానంలో ఉన్నాడు.

PSL 2026 : నాసిర‌కంగా హైద‌రాబాద్ జెర్సీ.. మ్యాచ్ మ‌ధ్య‌లో తెలుపు బంతి కాస్త గులాబి రంగులోకి.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు..

ఐపీఎల్ 2025 వేలంలో భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 10.75 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భువీ 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆర్‌సీబీ తొలిసారి క‌ప్పును ముద్దాడ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.