RCB vs SRH : ఆర్‌సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? హెడ్-టు-హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్టు, తుది జట్ల అంచనా..
తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు (RCB vs SRH) తలపడనున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : March 28, 2026 / 09:23 AM IST
IPL 2026 RCB vs SRH Head to head records pitch report Team prediction
- నేటి నుంచే ఐపీఎల్ 2026
- తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఢీ కొట్టనున్న సన్‌రైజర్స్
RCB vs SRH : ఐపీఎల్ 19 సీజన్ నేటి (శనివారం, మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచి.. విజయంతో ఈ సీజన్‌ను ఆరంభించాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని గతేడాది అందుకున్న ఆర్‌సీబీ జట్టు.. ట్రోఫీని నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పదేళ్ల క్రితం ఐపీఎల్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ రెండోసారి కప్పును ముద్దాడాలని భావిస్తోంది.
IPL 2026 : నేటి నుంచే ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీని ఢీ కొట్టనున్న సన్‌రైజర్స్
గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో ఆర్‌సీబీ బరిలోకి దిగనుంది. ఆర్‌సీబీకి రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు రెండు జట్లు ఐపీఎల్‌లో ఎన్ని సార్లు ముఖాముఖిగా తలపడ్డాయో, ఎవరు ఎక్కవ సార్లు గెలిచారో వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, 14 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఓ మ్యాచ్ రద్దు అయింది.
పిచ్..
సాధారణంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు ఉంటాయి. ఇక అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ విధ్వంసక బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్యాన్ని ఛేదించేందుకే మొగ్గు చూపించవచ్చు.
బెంగళూరు వాతావరణ సూచన..
భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అక్యూ వెదర్ ప్రకారం మ్యాచ్ సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండి, ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం లేదు. గాలిలో తేమ సుమారు 60 శాతంగా ఉండే అవకాశం ఉంది.
RCB vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భువనేశ్వర్ కుమార్
తుది జట్ల అంచనా..
ఆర్‌సీబీ తుది జట్టు అంచనా..
విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా..
ట్రావిస్ హెడ్, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ
