IPL 2026 : నేటి నుంచే ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీని ఢీ కొట్టనున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026 సీజన్ నేటి (IPL 2026) నుంచే ప్రారంభం కానుంది.
IPL 2026 season starts from today
- నేటి నుంచే ఐపీఎల్ 26 సీజన్
- 10 జట్లు 74 మ్యాచ్‌లు
- తొలి మ్యాచ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్
IPL 2026 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ నేటి (శనివారం, మార్చి 28) నుంచే ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు సిక్సర్ల, ఫోర్లు, వికెట్లు అంటూ క్రికెట్ ప్రేమికులు పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్ 19వ సీజన్లో 10 జట్లు పాల్గొంటుండగా.. క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌తో కలిసి మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
RCB vs SRH : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భువనేశ్వర్ కుమార్
17 ఏళ్ల పాటు కప్పు కోసం నిరీక్షించి ఎట్టకేలకు 18వ సీజన్లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఆర్సీబీ జట్టు ట్రోఫీని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. పదేళ్ల క్రితం ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో సారి కప్పును అందుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
ఇక చెరో ఐదేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మరోసారి ట్రోఫీని అందుకుని అత్యధిక సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది.
ఇన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అందుకోవాలని పంజాబ్ పట్టుదలగా ఉంది. మరోవైపు తొలి సీజన్లో విజేతగా రాజస్థాన్ రాయల్స్ మరోసారి కప్పును ముద్దాడలేదు. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ జట్టు రాతను మారుస్తాడని ఆర్ఆర్ ఆశిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ సెయింట్స్‌ను ఐపీఎల్ ట్రోఫీని నెరవేర్చుకోవాలన్న కోరికను కలిగి ఉన్నాయి.
ఐపీఎల్ అరంగ్రేటం చేసిన తొలి ఏడాదే కప్పును అందుకున్న గుజరాత్ టైటాన్స్ మరోసారి కప్పును ముద్దాడాలని ఆశిస్తోంది.
ఇదిలా ఉంటే.. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి సంతాప సూచకంగా ఈ సారి ఐపీఎల్ ఆరంభోత్సవ వేడుకలను రద్దు చేశారు.
