IPL 2026 : తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ విధ్వంసం.. సన్‌రైజర్స్‌ను చిత్తుచేసిన ఆర్సీబీ.. ఇషాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా..
IPL 2026 : ఐపీఎల్ -2026 సందడి మొదలైంది. శనివారం బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.
- Harishth Thanniru
- Published On : March 29, 2026 / 06:56 AM IST
IPL 2026
- ఐపీఎల్-2026 సందడి షురూ
- తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం
- చెలరేగిన పడిక్కల్, విరాట్ కోహ్లీ
- ఇషాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా
IPL 2026 : ఐపీఎల్ -2026 సందడి మొదలైంది. శనివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్ (61) చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేధించిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.
Also Read : Babar Azam : నువ్వు ఎక్కడ దొరికావ్ రా సామీ.. యాడ్ షూట్‌లోనూ క్యాచ్ మిస్.. బాబర్ ఆజామ్ పై ట్రోలింగ్..
ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ శనివారం బెంగళూరు వేదికగా జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (80) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజృంభించగా.. అనికేత్ వర్మ (18), క్లాసెన్ (31) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు 15.4ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
Khoobsoorat Batter 👌
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026
ఆర్సీబీ జట్టులో సాల్ట్ (8) రెండో ఓవర్లోనే ఔట్ కాగా.. ఆ తరువాత ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెంగళూరు దంచికొట్టింది. మంచి ఫామ్ లో ఉన్న పడిక్కల్ అలవోగా భారీ షాట్ లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లీ, పడిక్కల్ దూకుడుతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు ఒక్క వికెట్ కోల్పోయి 76 పరుగులు చేసింది. పడిక్కల్ ఔట్ అయిన తరువాత పాటిదార్ (31)తో కలిసి విరాట్ కోహ్లీ సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో భారీ స్కోర్ ను కాస్త కేవలం 15.4 ఓవర్లలోనే ఆర్సీబీ జట్టు చేధించి తొలి మ్యాచ్ లో విజేతగా నిలిచింది.
ಶುಭಾರಂಭ.
शुभारंब।
శుభారంభం.
Good start.#PlayBold
pic.twitter.com/DGPUaTHVoD— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026
