RR vs CSK : ఆర్ఆర్ వ‌ర్సెస్ సీఎస్‌కే.. హెడ్‌-టు-హెడ్ రికార్డ్స్‌, పిచ్‌, తుది జ‌ట్ల అంచ‌నా

సోమ‌వారం గువాహ‌టి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ (RR vs CSK) త‌ల‌ప‌డ‌నుంది.

IPL 2026 RR vs CSK head to head record pitch report details here

RR vs CSK : ఐపీఎల్ 2026లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. సోమ‌వారం గువాహ‌టి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సీజ‌న్‌లో రెండు జ‌ట్ల‌కు ఇదే తొలి మ్యాచ్‌. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి గెలుపు బోణీతో టోర్న‌మెంట్ ను ఆరంభించాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

కొన్నాళ్ల పాటు రాజ‌స్థాన్‌కు ఆడిన సంజూ శాంస‌న్ ఈ సీజ‌న్ నుంచి చెన్నైకి ఆడ‌నుండ‌గా, చాలా కాలం పాటు చెన్నైకి ఆడిన ర‌వీంద్ర జ‌డేజా ఈ సీజ‌న్ నుంచి ఆర్ఆర్ కు ఆడ‌నున్నాడు. ఈ క్ర‌మంలో ఈ పోరు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని గాయంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, ఈ సీజ‌న్‌లో తొలి రెండు వారాల పాటు ఆడ‌డ‌ని ఇప్ప‌టికే సీఎస్‌కే మేనేజ్‌మెంట్ స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో ధోని గైర్హ‌జ‌రీలో సంజూ శాంస‌న్ కీల‌క పాత్ర పోషించాల‌ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

హెడ్‌-టు-హెడ్ రికార్డులు..

ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌లు 31 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 16 మ్యాచ్‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించ‌గా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

Ajinkya Rahane : ర‌హానే వ్యాఖ్య‌ల పై మండిప‌డిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ముందే చెప్పాం క‌దా.. అయినా గానీ..

పిచ్‌..

గువాహ‌టిలోని బ‌ర్స‌పారా క్రికెట్ స్టేడియంలోని పిచ్ సాధార‌నంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది. ఆరంభంలో పేస‌ర్ల‌కు కాస్త స‌హ‌కారం ల‌భించ‌వ‌చ్చు. టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.

తుది జ‌ట్ల అంచ‌నా..

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

Mohammed Siraj : బిగ్‌బాస్ బ్యూటీతో హైద‌రాబాదీ పేస‌ర్ డేటింగ్..! వీడియో వైర‌ల్‌

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), ఆయుష్ మాత్రే, మాట్ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ సబ్: అన్షుల్ కాంబోజ్/గుర్జప్నీత్ సింగ్.